కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

భోళా శంకర్- 200 డ్యాన్సర్స్ తో సాంగ్ షూట్

Bhola Shankar Movie New Schedule Commence Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bhola Shankar,Bhola Shankar Movie,Bhola Shankar Telugu Movie,Bhola Shankar Update,Bhola
సాంగ్1 ని. చదువు

భోళా శంకర్- 200 డ్యాన్సర్స్ తో సాంగ్ షూట్

Bhola Shankar Movie New Schedule Commence Today

Bhola Shankar Movie New Schedule Commence Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bhola Shankar,Bhola Shankar Movie,Bhola Shankar Telugu Movie,Bhola Shankar Update,Bhola

గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. ఇక అప్పుడే తన కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమా భోళాశంకర్. మేకర్ మెహర్ రమేష్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా.

ఇక తాజా షెడ్యూల్ ఈరోజు ప్రారంభమైంది. హైదరాబాద్‌లో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్‌లో చిరంజీవితో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న కీర్తి సురేష్ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్