ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సమంత శాకుంతలం కూడా ఒకటని చెప్పొచ్చు. గుణశేఖర్-సమంత కాంబినేషన్ లో సినిమా వస్తుండటం.. అందులోనూ మైథలాజికల్ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కథతో ఈసినిమా వస్తుండటంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇంకా పాటలు అన్నీ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. అయితే ఈసినిమా రిలీజ్ పై మరోసారి ఫ్యాన్స్ కు షాకిచ్చారు మేకర్స్. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వార్తలు నిజం చేస్తూ నిజంగానే సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్. శాకుంతలం మూవీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ గురించి చిత్రనిర్మాణ సంస్థ తమ ట్విట్టర్‌లో అఫిషియల్‌గా పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిబ్రవరి 17న శాకుంతలం చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నామని ప్రేక్షకులకు తెలిపేందుకు చింతిస్తున్నాం. విడుదల తేదీని త్వరలోనే తెలియజేస్తాం. నిరంతరం మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. చూద్దాం మరి ఈసినిమాను ఇంకెప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారో..
The theatrical release of #Shaakuntalam stands postponed.
The new release date will be announced soon 🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/f0cyBfDCyj
— Gunaa Teamworks (@GunaaTeamworks) February 7, 2023
కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: