కార్తీక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది ఈసినిమా. బ్లాక్ మ్యాజిక్ థీమ్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు తెలుస్తుంది. ఒక ఊరిని వరుస చావులు వెంబడిస్తుంటాయి. ఆ చావులకు గల కారణాలు ఏంటీ అని తెలుసుకోవాడానికి హీరో ఆ ఊరికి వెళ్తాడు. అయితే అక్కడ ఆ హీరోకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అసలు ఆ చావుల వెనుక ఉన్న మిస్టరీ ఎంటీ అనేదే ఈ కథ అన్నట్టు ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ ను మొదలుపెట్టి మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే ఇటీవలే రిలీజైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈనెలలో రిలీజ్ అవుతుంది కాబట్టి మంత్ ఆఫ్ విరూపాక్ష అంటూ రిలీజ్ వరకూ సాలిడ్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కాబోతుందంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ గా ఉన్న పోస్టర్ ఆసక్తిని పెంచుతుంది.
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: