నాని దసరా ర్యాంపేజ్ బాక్సాఫీస్ వద్ద ఇంకా నడుస్తుంది. సినిమా రిలీజ్ అయి వారం రోజులు కావస్తుంది అయినా కూడా ఈసినిమా కలెక్షన్స్ మాత్రం ఆగట్లేదు. ఊచకోత కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించడం, సినిమా సాంగ్స్ బాగుండటం, ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్, అదిరిపోయిన సినిమా క్లైమాక్స్ ఇవన్నీ సినిమాకి ప్లస్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కలెక్షన్స్ లో కూడా దసరా మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ను అందిస్తుంది. ఈసినిమా రిలీజ్ అయిన మొదటి రోజే దాదాపు 38 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది. ఇక ఆ రోజు నుండి ఈరోజు వరకూ కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోయింది తప్పా ఎక్కడా తగ్గలేదు. అంతేకాదు 100 కోట్లు చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది అని అనుకున్నారు.. ఇక అనుకున్నట్టే చాలా తొందరగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. రిలీజ్ అయిన వారం రోజులకే 100 కోట్లు కలెక్ట్ చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తుంది. ముందు ముందు ఈ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. యూఎస్ కూడా దసరా జోరు ఎక్కడా తగ్గట్లేదు. అమెరికాలో కూడా 2 మిలియన్ డాలర్స్ సాధించి నాని కెరీర్ లో అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ సాధించిన మొదటి సినిమాగా నిలిచింది. చూద్దాం ధరణి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో..
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: