అశోక్ గల్లా2 యాక్షన్ టీజర్ రిలీజ్

action glimpse out from ashok galla 2 movie

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు తనకంటూ స్పెషల్ గా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతను కూడా వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అశోక్ గల్లా. హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అశోక్ మొదటి సినిమాతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఫిబ్రవరిలో పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది ఈసినిమా. ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది ఈసినిమా. ఇక నేడు అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వీడియోను రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. బురదలో జరిగే ఫైట్‌ సన్నివేశంతో కట్‌ చేసిన ఈ యాక్షన్ వీడియో ఇప్పుడు ఆకట్టుకుంటుంది.


కాగా ఈసినిమాకు అర్జున్ జంద్యాల దర్శకత్వంలో వహిస్తుండగా.. జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్‌ వర్మ కథను అందిస్తున్నాడు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేయనున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 18 =