మెగా అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా అని. ఇక ఎన్నో ఎళ్లు నుండి ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ ఇటీవలే అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్, ఉపాసన బేబీ షవర్ సెలబ్రేషన్స్ దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఈ వేడుకలో చరణ్, ఉపాసన జంట చూడ ముచ్చటగా అనిపించారు. ఉపాసన సోదరి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ పార్టీని అద్భుతంగా నిర్వహించారు. ఇవి వారికి మరుపురాని క్షణాలుగా చెప్పవచ్చు. ఉపాసన అమ్మమ్మ ఈ వేడుకలో హుందాగా కనిపించి అందరి హృదయాలను దోచుకున్నారు. ఇక ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత బుచ్చిబాబు తో సినిమా చేయనున్నాడు. ఇటీవలే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే కదా.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: