టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా తన సినిమాలతో అలరిస్తూ వస్తుంది సమంత. ఇక రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకోవడమే కాకుండా సమంత కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం శాకుంతలం సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రానున్న ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మయోసైటిస్ నుండి కోలుకున్న సమంత ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను సైతం స్టార్ట్ చేసేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీటితో పాటు సమంత మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఫ్యామిలీ మెన్ సిరీస్ తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సమంత తోపాటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ను ఇక్కడ మరోవైపు ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా చేస్తున్నారు. ఇంగ్లీష్ వెర్షన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది కూడా.
ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా హిందీ వెర్షన్ పై స్పందిస్తూ.. తన పాత్ర ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమంత ఎంతో టాలెంట్ ఉన్న నటి అని.. అటువంటి వారికి తప్పకుండా మరింత మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అంతేకాదు కొద్దిరోజుల క్రితం ఒక ఫంక్షన్ లో భాగంగా వరుణ్ ధావన్ ని కలిసినపుడు సిటాడెల్ సిరీస్ బాగా వస్తోందని, తాను సమంత ఎంతో కష్టపడుతున్నాం అని, అలానే దర్శకులైన రాజ్, డీకే అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: