ఆ ఒక్కటీ అడగొద్దు

mass maharaja ravi teja about ravanasura suspense

క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర’. ఈసినిమా ఏప్రిల్ 7వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు ఆకట్టుకోగా.. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో మెయిన్ ఎలిమెంట్ ను ఎప్పటినుండో సస్పెన్స్ లో ఉంచుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో సీత ఎవరు, రావణుడు ఎవరు అన్న విషయాలపై పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నా కూడా చిత్రయూనిట్ ఎక్కడా క్లారిటీ ఇవ్వడంలేదు. ఆ సస్పెన్స్ ను అలాగే కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మరోసారి ఆ ఒక్కటీ అడగొద్దు అంటున్నాడు. ఈ సినిమాలో హీరో లేడని అంటున్నారు .. మరి ఐదుగురు హీరోయిన్స్ ఎవరి కోసం? అన్న ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతూ… ఆ విషయం మాత్రం అడగొద్దు .. అదే సస్పెన్స్. ఈ ప్రశ్నకి ఆన్సర్ కావాలంటే 7వ తేదీ వరకూ వెయిట్ చేయాల్సిందే.. ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకి సంబంధించి ఏది అడిగినా అవునని చెప్పను .. కాదనీ చెప్పనూ అంటూ అదే సస్పెన్స్ ను కొనసాగించారు.

కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.