సినీ ఇండస్ట్రీల మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయి. టాలెంట్ ఎక్కడ ఉంటే మేకర్స్ అక్కడికి వెళ్లిపోతున్నారు. అందుకే పయోగాత్మక సినిమాలు ఎన్నో చూస్తున్నాం. అంతేకాదు నటీనటులు కూడా ఒకే భాషకు పరిమితం కాకుండా వేరే భాషల్లో తమ ప్రతిభను చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మనవాళ్లు హిందీలో అలానే హిందీ నటీ నటులు తెలుగులో నటించడానికి ఏమాత్రం సందేహించడంలేదు. ఇప్పటికే మనవాళ్లు చాలామంది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఓ పవర్ పుల్ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. ఈ అప్ డేట్ తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వార్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దాని సీక్వెల్ గా వార్ 2 సినిమా రానుంది. సీక్వెల్‌లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. దీంతో ఎన్టీఆర్ క్రేజ్ కూడా ఈసినిమాకు ఉపయోగపడుతుందని ఈభారీ మల్టీస్టారర్ ను రూపొందిచనున్నారు. ప్రస్తుతం హృతిక్, ఎన్టీఆర్ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో.. వచ్చే ఏడాది చివరిలో ఈసినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.
కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారు భారీ స్థాయిలో ఈసినిమాను నిర్మించనున్నారు. వార్ మొదటి భాగానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వహించగా..వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: