పద్మ శ్రీ అందుకున్న కీరవాణి

music director MM Keeravani receives the Padma Shri Award

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఈసినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ ను సైతం అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్శశ్రీ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది మొత్తం 106 పద్మ పురస్కారాలు ప్రకటించగా.. మార్చి 22 న తొలి విడతలో 50 మందికి పైగా ఇచ్చారు. ఇక ఇప్పుడు మిగిలిన వారందరికీ పురస్కారాలు అందచేశారు. దీనిలో భాగంగానే కీరవాణి కూడా పద శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మనసు మమత సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కీరవాణి. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకూ ఆయన తన సంగీతంతో అలరిస్తూనే ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళికి ఈయన ఆస్థాన సంగీత దర్శకుడు. 3 దశాబ్దాలుగా ఆయన తెలుగులో మాత్రమే కాదు తమిళ , కన్నడ , మలయాళ, హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించారు. గాయకుడిగా పలు హిట్ సాంగ్స్ ఆలపించారు. ఆయన కెరీర్ లో నేషనల్ అవార్డ్స్ తో పాటు ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. ఆయనకు ఇద్దరు తనయులు కాలభైరవ, సింహా. వీరిలో కాలభైరవ తండ్రి మార్గంలోనే సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. మరోవైపు సింహా తన నటనతో మెప్పిస్తూ సినిమాలు చేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.