20 ఏళ్ల సక్సెఫుల్ జర్నీ

star producer dil raju completes 20 fruitful years in TFI

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. నిజానికి దిల్ రాజు అసలు రేపు వెంకట రమణా రెడ్డి అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు 2003లో నితిన్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ మూవీని తొలిసారిగా నిర్మించారు. నిర్మాతగా ఫస్ట్ సినిమాతోనే తన బ్యానర్ పై మంచి సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆసినిమానే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజు అయ్యాడు. ఇక అక్కడి నుండి నిర్మాతగా తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దిల్ తర్వాత ఆయన వచ్చిన ఆర్య భద్ర బొమ్మరిల్లు ఒకదానికి మంచి ఒకటి విజయాల్ని అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకూ అందరికీ ఎన్నో మంచి సినిమాలను అందించాడు. ఇక నేటితో దిల్ రాజు సినీ ప్రయాణంలో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఇరవై ఏళ్లలో దిల్ రాజు సక్సెస్ రేటు పెరిగిందనే చెప్పాలి కానీ ఎక్కడా తగ్గలేదు అని చెప్పొచ్చు. తన నుండి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ అన్న అభిప్రాయాన్ని సొంతం చేసుకున్నాడు. కేవలం సక్సెస్ ను మాత్రమే కాదు..ఎన్నో అపవాదులు కూడా దిల్ రాజుపై మోపిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా వాటన్నింటినీ ధైర్యంతో ఎదుర్కొంటూ ఇన్నేళ్లూ సక్సెస్ ఫుల్ నిర్మాతగా టాప్ లో రాణిస్తున్నాడు.

ఇక ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే మరో కొత్త బ్యానర్ ను స్థాపించాడు. కొత్త టాలెంట్ ను అలానే చిన్న సినిమాలను నిర్మించడానికి ఈ బ్యానర్ ను స్థాపించాడు. ఇక ఈనేపథ్యంలోనే ఈబ్యానర్ నుండి బలగం అనే కొత్త సినిమాను నిర్మించి మొదటి సినిమాతోనే సక్సెస్ ను అందుకుంటాడు. అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది బలగం సినిమాకు.

మరి ముందు ముందు కూడా దిల్ రాజు ఎన్నో సినిమాలు నిర్మించాలని.. నిర్మాతగా మంచి మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందించాలని కోరుకుందాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.