మన తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తాను చాటుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులతో పాటు ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు మరో సినిమా కూడా అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చుకుంది. చాలా చిన్న సినిమాగా అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా బలగం. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బలగం. తెలంగాణ సంస్కృతి, మానవ సంబంధాలని మనసులకు హత్తుకునేలా భావోద్వేగాలతో నిండిన కథను తీసుకొచ్చి దర్శకుడిగా విజయాన్ని సాధించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అయి అక్కడ కూడా టాప్ లో దూసుకుపోతుంది. కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మేకర్స్ కు సాలిడ్ లాభాలను అందించిన ఈసినిమా. రీసెంట్ గానే అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది. తాజాగా ఈసినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఏ రకంగానైనా ఈ సినిమాను జనమంతా చూడాలనేది మా కోరిక. థియేటర్ ద్వారా .. ఓటీటీ ద్వారా .. టీవీల ద్వారా ఈ సినిమా జనంలోకి వెళ్లాలనే అనుకున్నాము. ఇప్పుడు నాలుగో ఆప్షన్ కూడా వచ్చేసింది. ఊరూరా తెరలు కట్టేసి ఈ సినిమాను వేసుకుని చూస్తారని మేము ఊహించలేదు. ఈ సినిమాను ఎక్కడ ప్రదర్శిస్తున్నా ఆపేసే ఉద్దేశం లేదు .. ఓపెన్ గా చెబుతున్నాను ఎక్కడా ఆగదు అన్నారు. బలగం సినిమా చూసి గతంలో విడిపోయిన చాలా కుటుంబాలు కలుసుకుంటూ ఉండటం మాకు ఆనందాన్ని కలిగిస్తుంది అని తెలిపారు.
కాగా ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: