
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 110


సైంధవ్ లో మల్టీ టాలెంటెడ్ నటి

సెన్సేషనల్ పుష్ప 2 గా ఇంటర్వెల్ బ్లాక్

విశాల్ మార్క్ అంథోని టీజర్ రిలీజ్

శ్రీ విష్ణు సామజవరగమన టీజర్ రిలీజ్

SSMB 28 రూమర్స్ పై ఫైర్ అయిన వంశీ

భోళా శంకర్ డబ్బింగ్ మొదలు

మహేష్ బాబు రిలీజ్ చేసిన ప్రేమ విమానం టీజర్

సమంతకు గుడి కట్టిస్తున్న అభిమాని

విరూపాక్ష 6డేస్ కలెక్షన్స్

నాని 30 షూటింగ్ అప్ డేట్ - గోవాలో భారీ షెడ్యూల్

ఛాంగురే బంగారురాజా టీజర్ రిలీజ్

సామజవరగమన టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

విరూపాక్ష పై సుకుమార్ రియాక్షన్

విశ్వక్ 11 సినిమా గ్రాండ్ లాంచ్
ఉస్తాద్ భగత్ సింగ్ ఎడిటింగ్ ప్రారంభం

పవన్-తేజ్ మూవీ అద్భుతంగా వస్తుంది

ఎన్టీఆర్ తో వర్క్ చేస్తా అంటున్న హాలీవుడ్ మేకర్

రజినీ మూవీలో సూర్య?
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో…

సైంధవ్ లో మల్టీ టాలెంటెడ్ నటి
విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా సైంధవ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న చిత్రయూనిట్ రెండో షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమాలో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న ఇద్దరు హీరోయిన్లను ప్రకటించారు మేకర్స్. టాలెంటెడ్ నటి శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ సింగ్ పాత్రలకు సంబంధించిన పోస్టర్లను ప్రకటించారు. శ్రద్ధ శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో అలానే రుహానీ సింగ్ డా.రేణు పాత్రలో నటిస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమాలో నటిస్తున్న మరో హీరోయిన్ కు…

సెన్సేషనల్ పుష్ప 2 గా ఇంటర్వెల్ బ్లాక్
అప్ కమింగ్ మూవీస్ లో దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 సినిమా కూడా ఒకటి. పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈమధ్యనే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేయడంతోపాటు పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక వీటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోయి కొత్త రికార్డులు సైతం క్రిియేట్ చేసుకుంది.

విశాల్ మార్క్ అంథోని టీజర్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మార్క్ అంథోని. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విశాల్. అంతేకాదు ఈసినిమాలో డిఫరెంట్ లుక్ లో కూడా కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి చెప్పొచ్చు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

శ్రీ విష్ణు సామజవరగమన టీజర్ రిలీజ్
కెరీర్ మొదటి నుండీ విభిన్నమైన కథలు, విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని చూసుకుంటాడు. అయితే ఒక్కోసారి అవి సక్సెస్ అవ్వొచ్చు.. ఒక్కోసారి కాకపోవచ్చు. అయినా కూడా తన ప్రయోగాలను ఎప్పుడూ ఆపలేదు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న సినిమా సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.

SSMB 28 రూమర్స్ పై ఫైర్ అయిన వంశీ
సూపర్ స్టార్ మహేష్ బాబు,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన అతడు,ఖలేజా థియేటర్లలో అనుకున్నంతగా ఆడకపోయినా బుల్లితెరపై బ్లాక్ బాస్టర్ హిట్లయ్యాయి. ఈసినిమాలకు చాలా మందే ఫ్యాన్స్ వున్నారు.ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా కూడా వస్తుంది.అదే SSMB 28(వర్కింగ్ టైటిల్).ఈసినిమాపై సహజంగానే భారీ అంచనాలు వున్నాయి.అయితే షూటింగ్ ప్రారంభమైన దగ్గరనుండి సినిమా గురించి ఏదో ఒక రూమర్ వస్తూనే వుంది. ఇటీవల ఈరూమర్స్ మరీ ఎక్కువైపోయాయి.

భోళా శంకర్ డబ్బింగ్ మొదలు
ఈఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు ఈమధ్యనే ప్రకటించారు. ఇక తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఒకపక్క షూటింగ్ ను జరుపుకుంటూ ఉండగానే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేసింది. ఈసినిమా డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

మహేష్ బాబు రిలీజ్ చేసిన ప్రేమ విమానం టీజర్
సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్, శాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ప్రేమ విమానం. న్యూ ఏజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

సమంతకు గుడి కట్టిస్తున్న అభిమాని
సినీ సెలబ్రిటీలకు అభిమానులు ఉండటం అనేది కామన్.. అయితే కొంతమందికి మాత్రం ఆ అభిమానం పాళ్లు కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే వారి పేరు మీద ఏవైనా సేవా కార్యక్రమాలు కానీ.. లేదా వారికి మంచి పేరు వచ్చే పనులు.. లేదా ఇంకాస్త విభిన్నంగా తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది అయితే ఏకంగా గుడులు కట్టేస్తుంటారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లకు వారి అభిమానులు గుడి కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. ఖుష్బు, నమిత, నయనతార, హన్సిక, నిధి అగర్వాల్ గుడులను వారి వారి అభిమానులు కట్టించారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సమంత కూడా చేరిపోయింది.

విరూపాక్ష 6డేస్ కలెక్షన్స్
సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ మంచి వసూళ్లను రాబడుతుంది.5రోజుల్లో 55కోట్ల గ్రాస్ ను మార్క్ ను క్రాస్ ను చేయగా నిన్న మరో 4 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది దాంతో 6రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విరూపాక్ష 59కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విరూపాక్ష ఆల్రెడీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయడంతో ఫుల్ రన్ లో డిస్ట్రీబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకురానుంది.

ఓటిటి లోకి దసరా
నాని నటించిన దసరా గత నెలలో విడుదలై నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు115కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకొచ్చింది.అటు ఓవర్సీస్ లో అయితే ఏకంగా 2మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో విడుదలైయింది.నెట్ ఫ్లిక్స్ ఈరోజునుండి తెలుగు తోపాటు,మలయాళ,కన్నడ,తమిళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక ఓటిటి లో చూసిన వాళ్ళు కూడా దసరాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.

నాని 30 షూటింగ్ అప్ డేట్ - గోవాలో భారీ షెడ్యూల్
న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా మూవీతో కెరీర్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. మొదటిసారి ఇప్పటివరకూ చేయని పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఒక్క నాని మాత్రమే కాదు చిత్రయూనిట్ అంతా కష్టపడి తీయడం వల్లనే బ్లాక్ బస్టర్ రిజల్డ్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో రెడీ అయిపోయాడు నాని. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తన 30 వ సినిమా వస్తుంది. ప్రస్తుతానికి నాని30 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో కూడా నాని డిఫరెంట్ పాత్రలో నటించనున్నాడు. 6ఏళ్ల కూతురికి తండ్రిగా ఈసినిమాలో నటించనున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించారు…

రామబాణం సెన్సార్ రిపోర్ట్ - క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామాబాణం. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మే 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈవిషయాన్ని శ్రీవాస్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ సెన్సార్ బృందం తమ సినిమాను ప్రశంసించినట్టు తెలిపారు.

ఛాంగురే బంగారురాజా టీజర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ వరుసగా ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్లను అందుకోగా రీసెంట్ గా రిలీజ్ అయిన రావణాసుర సినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా రవితేజ ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ పెట్టి దానిపై పలు సినిమాలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ బ్యానర్ నుండి పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

సామజవరగమన టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో కాస్త డిఫరెంట్ కథలతో వచ్చే హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు. మొదటినుండీ కూడా సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని.. అలానే కథలను కూడా ఎంచుకుంటూ వెళుతున్నాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన.

విరూపాక్ష పై సుకుమార్ రియాక్షన్
ఒక సినిమా హిట్ అయితే దానికి ఇండస్ట్రీ నుండి ప్రశంసలు బాగానే దక్కుతున్నాయి. సినిమా చూసిన తరువాత సెలబ్రిటీలు తమ స్పందనను తెలియచేస్తున్నారు. ఇప్పుడు విరూపాక్ష కు కూడా అలాంటి ప్రశంసలే దక్కుతున్నాయి. ఈసినిమాపై కూడా సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈసినిమా పై స్పందిస్తూ ప్రశంసించారు. ఈసినిమా గురించి స్పందిస్తూ.. వావ్ అని చెప్పగలను.. ఈసినిమా కథను నాకు చెప్పినప్పుడ నేను ఈసినిమా సూపర్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఏర్పడింది.. అయితే ఈసినిమాను 24 క్రాఫ్ట్స్ లో స్క్రీన్ పై విజువల్ గా ఎలా తీర్చిదిద్దారు అనేది ఆశ్చర్యం…

విశ్వక్ 11 సినిమా గ్రాండ్ లాంచ్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. రీసెంట్ గానే దమ్కీ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాను మొదలపెట్టేశాడు. విశ్వక్ సేన్ 11వ సినిమాను రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక నేడు ఈసినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. మరి ఈసినిమాలో విశ్వక్ లుక్ మార్చినట్టు ఫొటోలను బట్టి అర్థమవుతుంది. ఈకార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు విచ్చేసి క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. ఇక మే మధ్య నుండి ఈసినిమా షూటింగ్…
ఉస్తాద్ భగత్ సింగ్ ఎడిటింగ్ ప్రారంభం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ముందు ఉంటుంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాను ప్రకటించిన దగ్గరనుండే అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. మరో షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

పవన్-తేజ్ మూవీ అద్భుతంగా వస్తుంది
మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రావడంతో అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి సాయి తేజ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందుకున్నాడు. ఇక ఈసినిమా మంచి సక్సెస్ అవ్వడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు సాయి తేజ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేశారు. ఇక దీనికి గాను సాయి తేజ్ తన సోషల్ మీడియా ద్వారా కతజ్ఞతలు చెప్తూ.. తమ బ్యానర్ నుండి వస్తున్న వినోదయ సితం రీమేక్ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

ఎన్టీఆర్ తో వర్క్ చేస్తా అంటున్న హాలీవుడ్ మేకర్
ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళితో పాటు ఆ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు కూడా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఎంతో మంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సినిమాను చూడటమే కాకుండా వారి నటనపై ప్రశంసలు సైతం కుమ్మరించారు. అంతేకాదు కొంతమంది వారితో వర్క్ చేయాలన్న కోరికను కూడా బయటపెడుతున్నారు. తాజాగా ఈసినిమా చూసిన ఓ సెలబ్రిటీ కూడా ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయి తనతో వర్క్ చేయాలన్న ఆకాంక్షను బయటపెట్టారు. ఆయన ఎవరో కాదు 'గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ' చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్.