న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా మూవీతో కెరీర్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. మొదటిసారి ఇప్పటివరకూ చేయని పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఒక్క నాని మాత్రమే కాదు చిత్రయూనిట్ అంతా కష్టపడి తీయడం వల్లనే బ్లాక్ బస్టర్ రిజల్డ్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో రెడీ అయిపోయాడు నాని. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తన 30 వ సినిమా వస్తుంది. ప్రస్తుతానికి నాని30 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో కూడా నాని డిఫరెంట్ పాత్రలో నటించనున్నాడు. 6ఏళ్ల కూతురికి తండ్రిగా ఈసినిమాలో నటించనున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 21వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా షూటింగ్ గురించి అప్ డేట్ ఇచ్చాడు నాని. తన సోషల్ మీడియా ద్వారా సెట్ లో ఉన్న పిక్ ను షేర్ చేస్తున్నాడు. ఇప్పుడు గోవాలో షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈ షెడ్యూల్ చాలా పెద్ద షెడ్యూల్ అని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లోనే మేజర్ కాస్ట్ అంతా పాల్గొననున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈసినిమాలో సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: