సెన్సేషనల్ పుష్ప 2 గా ఇంటర్వెల్ బ్లాక్

crazy update on pushpa 2 interval block

అప్ కమింగ్ మూవీస్ లో దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 సినిమా కూడా ఒకటి. పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈమధ్యనే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేయడంతోపాటు పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక వీటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోయి కొత్త రికార్డులు సైతం క్రిియేట్ చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. ఈనేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈసినిమాలో చాలా ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్స్ ను ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. అంతేకాదు ఇంటర్వెల్ బ్లాక్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తదని అంటున్నారు. ఈ ఇంటర్వెల్ సీక్వెల్ ను ఒక్కటే 35రోజులు షూట్ చేయనున్నారట.. ఈ సీక్వెన్స్ కోసం బన్నీ మేకోవర్ కే మూడు గంటల టైమ్ పడుతుందని అంటున్నారు. మరి ఆ సీక్వెన్స్ ను చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో జగపతిబాబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 3 =