విరూపాక్ష పై సుకుమార్ రియాక్షన్

director sukumar praises on virupaksha movie

ఒక సినిమా హిట్ అయితే దానికి ఇండస్ట్రీ నుండి ప్రశంసలు బాగానే దక్కుతున్నాయి. సినిమా చూసిన తరువాత సెలబ్రిటీలు తమ స్పందనను తెలియచేస్తున్నారు. ఇప్పుడు విరూపాక్ష కు కూడా అలాంటి ప్రశంసలే దక్కుతున్నాయి. ఈసినిమాపై కూడా సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈసినిమా పై స్పందిస్తూ ప్రశంసించారు. ఈసినిమా గురించి స్పందిస్తూ.. వావ్ అని చెప్పగలను.. ఈసినిమా కథను నాకు చెప్పినప్పుడ నేను ఈసినిమా సూపర్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఏర్పడింది.. అయితే ఈసినిమాను 24 క్రాఫ్ట్స్ లో స్క్రీన్ పై విజువల్ గా ఎలా తీర్చిదిద్దారు అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది.. ఇక తేజు ఈకథను నమ్మి క్లిష్టపరిస్థుతుల్లో కూడా ఈ సినిమాకోసం పనిచేసినందకు అభినందించాలి.. సంయుక్త మీనన్ కూడా చాలా బాగా నటించింది. తన లెన్స్ ద్వారా విరూపాక్ష వరల్డ్ ను రియల్ లైఫ్ కు తెచ్చిన శ్యామ్ దత్ ఇంకా నాగేంద్ర, అజనీష్ ఈసినిమాకు ప్రధాన బలం.. అంటూ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Sukumar B (@aryasukku)

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా.. సునీల్,సాయి చంద్, అజయ్,బ్రహ్మజీ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈసినిమా కు సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే తేజ్ క్లారిటీ ఇచ్చాడు. మరి ఈసీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 3 =