నాని నటించిన దసరా గత నెలలో విడుదలై నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు115కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకొచ్చింది.అటు ఓవర్సీస్ లో అయితే ఏకంగా 2మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో విడుదలైయింది.నెట్ ఫ్లిక్స్ ఈరోజునుండి తెలుగు తోపాటు,మలయాళ,కన్నడ,తమిళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక ఓటిటి లో చూసిన వాళ్ళు కూడా దసరాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈసినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా దీక్షిత్ శెట్టి,సాయి కుమార్, షైన్ టామ్చాకో కీలకపాత్రల్లో కనిపించారు.సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో నాని, కీర్తి సురేష్ నటన ,శ్రీకాంత్ డైరెక్షన్,సంతోష్ నారాయణన్ సంగీతం,సత్యాన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ హైలైట్ అయ్యాయి.
ఇదిలావుంటే నాని ప్రస్తుతం తన 30వ సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ గత కొద్దీ రోజులనుండి గోవాలో జరుగుతుంది. ఈసినిమాలో నాని,తండ్రి పాత్రలో కనిపించనున్నాడు.శౌర్యువ్ డైరెక్ట్ చేస్తుండగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో అతనికి ఇదే మొదటి సినిమా. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈసినిమా ఈ ఏడాది డిసెంబర్ 21న విడుదలకానుంది. మరి ఈసినిమా తో నాని వరుసగా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: