సమంతకు గుడి కట్టిస్తున్న అభిమాని

die hard fan built a temple for star heroine samantha

సినీ సెలబ్రిటీలకు అభిమానులు ఉండటం అనేది కామన్.. అయితే కొంతమందికి మాత్రం ఆ అభిమానం పాళ్లు కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే వారి పేరు మీద ఏవైనా సేవా కార్యక్రమాలు కానీ.. లేదా వారికి మంచి పేరు వచ్చే పనులు.. లేదా ఇంకాస్త విభిన్నంగా తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది అయితే ఏకంగా గుడులు కట్టేస్తుంటారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లకు వారి అభిమానులు గుడి కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. ఖుష్బు, నమిత, నయనతార, హన్సిక, నిధి అగర్వాల్ గుడులను వారి వారి అభిమానులు కట్టించారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సమంత కూడా చేరిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన సందీప్ అనే అభిమాని తన ఇంటిలోనే సమంత విగ్రహం తయారు చేయించి గుడి కడుతున్నాడు. సమంత బర్త్ డే కి ఈగుడిని ప్రారంభించాలని చూస్తున్నారు. అంతేకాదు ఈమధ్య సమంత మయోసైటిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సందీప్‌ మయోసైటిస్‌ నుంచి కోలుకున్న సందర్భంగా తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడప దర్గా లాంటి పుణ్య క్షేత్రాలకు సైతం వెళ్లి మొక్కుబడి నిర్వహించినట్టు తెలుస్తుంద.

ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. రీసెంట్ గానే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందింలేకోయింది. ప్రస్తుతం తెలుగులో శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమాలో నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. సమంత మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఫ్యామిలీ మెన్ సిరీస్ తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + fourteen =