పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ముందు ఉంటుంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాను ప్రకటించిన దగ్గరనుండే అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. మరో షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఎడిటింగ్ పనులు మొదులుపెట్టినట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు. ఈమేరకు పూజ కూడా నిర్వహించి ఆ ఫొటోలను తమ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేశారు. మరి ఒక్క షెడ్యూల్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారంటే తొందరగా రిలీజ్ ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది.
After a Blockbuster schedule, editing works begin for #UstaadBhagatSingh 💥💥
Stay tuned for some blasting updates very soon🔥🔥🔥@PawanKalyan @sreeleela14 @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad pic.twitter.com/ooCZQwUsp7
— Mythri Movie Makers (@MythriOfficial) April 26, 2023
కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.