మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రావడంతో అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి సాయి తేజ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందుకున్నాడు. ఇక ఈసినిమా మంచి సక్సెస్ అవ్వడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు సాయి తేజ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేశారు. ఇక దీనికి గాను సాయి తేజ్ తన సోషల్ మీడియా ద్వారా కతజ్ఞతలు చెప్తూ.. తమ బ్యానర్ నుండి వస్తున్న వినోదయ సితం రీమేక్ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సాయి తేజ్ పోస్ట్ పై స్పందించిన నిర్మాత టిజి విశ్వప్రసాద్ స్పందిస్తూ మీలాంటి డెటికేషన్ ఉన్న వారితో కలిసి పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా… పవన్ కళ్యాణ్ గారు.. మీరు కలిసి చేస్తున్న ఈసినిమా మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.. అలానే మంచి స్థాయికి వెళుతుంది.. తప్పకుండా రిలీజ్ తరువాత అందరినీ ఆకట్టుకుంటుందని పోస్ట్ లో పేర్కొన్నారు.
Im happy to have the opportunity to collaborate with someone as passionate and dedicated as you @IamSaiDharamTej garu, im sure #PKSDT is going to be a fantastic experience, and I have no doubt that we’ll achieve great things. Let’s make some magic happen! 🎉🤝” https://t.co/xfJEc4hcHI
— Vishwa Prasad (@vishwaprasadtg) April 25, 2023
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను జులై 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.