ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళితో పాటు ఆ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు కూడా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఎంతో మంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సినిమాను చూడటమే కాకుండా వారి నటనపై ప్రశంసలు సైతం కుమ్మరించారు. అంతేకాదు కొంతమంది వారితో వర్క్ చేయాలన్న కోరికను కూడా బయటపెడుతున్నారు. తాజాగా ఈసినిమా చూసిన ఓ సెలబ్రిటీ కూడా ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయి తనతో వర్క్ చేయాలన్న ఆకాంక్షను బయటపెట్టారు. ఆయన ఎవరో కాదు ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం జేమ్స్ గన్ సూపర్ మ్యాన్.. లెగసీ అనే సినిమాను తీస్తున్నారు. ఈనేపథ్యంలో ఆసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన ఓ మీడియాతో ముచ్చటించిన సందర్భంలో ఎవరైనా భారతీయ నటులను గార్డియన్స్ ప్రపంచంలోకి తీసుకు రావాలని అనుకుంటున్నారా? అని అడగగా ఏమాత్రం ఆలోచించకుండా ఎన్టీఆర్ పేరు చెప్పారు జేమ్స్ గన్. ఇంటర్వెల్ సీన్ లో ఎన్టీఆర్ వన్యమృగాలతో కిందకి దూకే సీన్ తనకు ఇష్టమని.. ఎన్టీఆర్ చాలా బాగా నటించాడని తెలిపాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీముడు అనే పాత్రలో నటించాడు. అమాయకమైన పాత్రలో నటిస్తూ ఎన్టీఆర్ అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొమురం భీముడో కొమురం భీముడో పాట గురించి. ఈపాటలో కేవలం తన ఎక్స్ ప్రేషన్స్ తోనే పాటకు ప్రాణం పోశాడు. మరి ఈమధ్య ఆస్కార్ వేడుకలకు అమెరికా వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందని చెప్పారు. చూద్దాం మరి మన హీరోలు హాలీవుడ్ సినిమాల్లో కూడా త్వరలోనే నటించే అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేస్తున్నాడు. ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకనే పనిలో ఉంది. ఇంకా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. వీటితో పాటు బాలీవుడ్ పై కూడా ఎన్టీఆర్ కన్నేశాడు. ఈనేపథ్యంలోనే హృతిక్ రోషన్ చేస్తున్న వార్2 సినిమాలో కూడా నటించబోతున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: