భోళా శంకర్ డబ్బింగ్ మొదలు

chiranjeevi bholaa shankar movie starts dubbing

ఈఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు ఈమధ్యనే ప్రకటించారు. ఇక తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఒకపక్క షూటింగ్ ను జరుపుకుంటూ ఉండగానే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేసింది. ఈసినిమా డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 17 =