విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా సైంధవ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న చిత్రయూనిట్ రెండో షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమాలో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న ఇద్దరు హీరోయిన్లను ప్రకటించారు మేకర్స్. టాలెంటెడ్ నటి శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ సింగ్ పాత్రలకు సంబంధించిన పోస్టర్లను ప్రకటించారు. శ్రద్ధ శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో అలానే రుహానీ సింగ్ డా.రేణు పాత్రలో నటిస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమాలో నటిస్తున్న మరో హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో మల్టీ టాలెంటెడ్ నటి ఆండ్రియా కూడా నటిస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు. ఈసినిమాలో ఆండ్రియా జాస్మిన్ అనే పాత్రలో నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A multifaceted performer who shines in every avatar💥
Introducing @andrea_jeremiah as JASMINE from #SAINDHAV 🔥#SaindhavOnDec22 ❤️🔥
Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @vboyanapalli @Music_Santhosh @tkishore555 #Venky75 pic.twitter.com/Io5jXAPay4
— Niharika Entertainment (@NiharikaEnt) April 28, 2023
కాగా ఈసినిమాలో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు నవాజుద్దీన్. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: