మాస్ మహారాజా రవితేజ వరుసగా ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్లను అందుకోగా రీసెంట్ గా రిలీజ్ అయిన రావణాసుర సినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా రవితేజ ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ పెట్టి దానిపై పలు సినిమాలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ బ్యానర్ నుండి పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సతీష్ వర్మ దర్శకత్వంలో కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం, ఖుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఛాంగురే బంగారురాజా. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రవితేజ చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. సునీల్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈటీజర్ ఫుల్ ఫన్ తో ఆకట్టుకుంటుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.
3 Love Stories amid a murder mystery❤️🔥
The most thrilling & entertaining #ChangureBangaruRaja Teaser OUT NOW 💥
IN CINEMAS SOON🔥@RaviTeja_offl @KarthikRathnam3 @msvarma1 @GoldieNissy #Satya #Ravibabu @rajtirandasu @UrsNityasri @RTTeamWorks… pic.twitter.com/Yl855hB9ok
— RT Team Works (@RTTeamWorks) April 26, 2023
ఇంకా ఈ మూవీ లో సత్య , రవిబాబు, కీలక పాత్రల్లో నటిస్తుండగా..గోల్డీ నిస్సీ, నిత్య శ్రీ, ఎస్తేర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం, సుందర్ ఎన్.సి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఆర్టీ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై రవితేజ ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: