విశ్వక్ 11 సినిమా గ్రాండ్ లాంచ్

vishwak sen 11th movie grand launch

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. రీసెంట్ గానే దమ్కీ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాను మొదలపెట్టేశాడు. విశ్వక్ సేన్ 11వ సినిమాను రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక నేడు ఈసినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. మరి ఈసినిమాలో విశ్వక్ లుక్ మార్చినట్టు ఫొటోలను బట్టి అర్థమవుతుంది. ఈకార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు విచ్చేసి క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. ఇక మే మధ్య నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు కూడా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నాడు. ఇక ముందు నుండీ అనుకుంటున్నట్టే ఈసినిమాలో అంజలి హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ,శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =