నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా తరువాత రజినీ తన 170వ సినిమా టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో సూర్య అతిథి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఓ పవర్ ఫుల్ పాత్రలో సూర్య క్యామియో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకూ వెయిట్ చేయాల్సిందే. కాగా సూర్యతో జ్ఞానవేల్ జై భీమ్ సినిమాను తెరకెక్కించిన సంగి తెలిసిందే కదా. ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: