సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్, శాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ప్రేమ విమానం. న్యూ ఏజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. ఓ పల్లెటూరులోని ఇద్దరు పిల్లలు రోజూ విమానాన్ని చూస్తుంటారు. రోజూ చూస్తూ ఉండగా వారికి ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. అసలు విమానం అంత ఎత్తు ఎలా ఎగురుతుందనే సందేహం కూడా వారిలో ఉంటుంది. ఇంకా విమానానికి సంబంధించి వారికి చాలా సందేహాలుంటాయి. మరో వైపు సంగీత్ శోభన్, శాన్వి మేఘన ప్రేమ.. మధ్యలో మనస్పర్దలు తలెత్తుతాయి. వాటికి కారణం ఏంటి? వారి ప్రేమని ఊరు అంగీకరిస్తుందా? విమానానికి వీరి జీవితాలకు సంబంధం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. టీజర్ లో ప్రేమ అలానే పిల్లల మధ్య ఉండే అమాయకత్వం అన్ని కోణాలు చూపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంటుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Presenting the teaser of #PremaVimanam! Wishing the team all the very best! ♥️https://t.co/PKys0pqm6m@AbhishekPicture @saanvemegghana@santoshkata @dopjagadeeshch @anusuyakhasba @vennelakishore @anuprubens @vasupotini @mohitrawlyani @ZEE5Telugu
— Mahesh Babu (@urstrulyMahesh) April 27, 2023
కాగా ఇంకా ఈసినిమాలో దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అనసూయ, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్‌రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. జగదీష్ చీకటి కెమెరామెన్. అభిషేక్ పిక్చర్స్, జీ5తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: