సామజవరగమన టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

sri vishnu samajavaragamana movie teaser release date fixed

టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో కాస్త డిఫరెంట్ కథలతో వచ్చే హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు. మొదటినుండీ కూడా సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని.. అలానే కథలను కూడా ఎంచుకుంటూ వెళుతున్నాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా కాలమే అయిందే. అప్పుడెప్పుడో ఈసినిమా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ తో వచ్చారు. ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఏఎంబీ సినిమాస్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. సమ్మర్‌ లో ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు కూడా ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + nine =