
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 95


అందుకే హిందీ మూవీస్ కు నో చెప్పా..!

డబుల్ థ్రిల్ తో 'రాక్షసుడు 2'

"విక్రాంత్ రోణ"మూవీ సక్సెస్ మీట్

హీరో ప్రభాస్ పై కృతి సనన్ ప్రశంసలు

'సీతారామం' కోసం డార్లింగ్..!

అవకాశాల ముందు అవి నథింగ్..!

సత్యదేవ్ 'కృష్ణమ్మ' టీజర్ అప్ డేట్..!

చియాన్ విక్రమ్ "ధృవ నచ్చిత్తిరమ్" మూవీ అప్ డేట్

'శాకుంతలం'.. ఫ్యాన్స్ కోసం అప్ డేట్..!

వాషింగ్టన్ డీసీలో పూజాహెగ్డే వెకేషన్ ఎంజాయ్

బిగ్ ఎంటర్ టైనర్ గా "ధమాకా !"

ప్రభాస్ సక్సెస్ కు అదే కారణం..!

'కార్తికేయ2' థియేట్రికల్ ట్రైలర్ అప్ డేట్..!

17 ఏళ్ల తరువాత మ్యాజికల్ ట్రియో..!
బన్నీ- సుకుమార్-రత్నవేలు ఈ మ్యాజికల్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మరోసారి ఈ కాంబినేషన్ కలిసింది. అయితే ఏదో సినిమా కోసం కాదులెండి. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అల్లు అర్జున్ పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేథ్యంలో ఓ కమర్షియల్ యాడ్ కోసం బన్నీ, సుకుమార్, రత్నవేలు కలిసి పనిచేస్తున్నారు. ఈసందర్భంగా సెట్ లో వీరు ముగ్గురు కలిసి తీసుకున్న ఫొటోను సుకుమార్ సతీమణి బబిత సుకుమార్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాదాపు 17ఏళ్ల తరువాత ఈ మ్యాజికల్ ట్రియో కలిసి పనిచేస్తున్నారంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఈఫొటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అందుకే హిందీ మూవీస్ కు నో చెప్పా..!
వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య రీసెంట్ గానే థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా నాగ చైతన్య నిరాశనే మిగిల్చింది. ఈసినిమా సరైన విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం మరో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ ప్రమోషన్ తో బిజీగా ఉన్నాడు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో వస్తున్న లాల్ సింగ్ చడ్డా అనే సినిమాలో చైతు ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాతోనే నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈసినిమా కంటే తనకు ముందే బాలీవుడ్ లో ఛాన్స్ లు వచ్చాయని అయితే నో చెప్పానని అంటున్నాడు చైతు.

డబుల్ థ్రిల్ తో 'రాక్షసుడు 2'
రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన సినిమా రాక్షసుడు. ఆడపిల్లలను వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లే ఓ సైకో కిల్లర్ కథ ఇది. తమిళంలో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈసినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాదు వరుసగా ఫ్లాప్స్ తో ఉన్న సాయి శ్రీనివాస్ కు ఈసినిమాతోనే ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఈసినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చేసింది. టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

"విక్రాంత్ రోణ"మూవీ సక్సెస్ మీట్
కిచ్చా క్రియేషన్స్ , షాలిని ఆర్ట్స్ , ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నీతా అశోక్ , జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. నిరూప్ భండారి, రవిశంకర్ గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.హీరో సుదీప్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.హీరో సుదీప్ కెరీర్‌లోనే హైయెస్ట్…

హీరో ప్రభాస్ పై కృతి సనన్ ప్రశంసలు
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ నటించిన మైథలాజికల్ మూవీ…

'సీతారామం' కోసం డార్లింగ్..!
మహానటి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక ఈసారి డైరెక్ట్ తెలుగు సినిమాతోనే వచ్చేస్తున్నాడు. హనురాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సీతారామం. 1960 కాలంనాటి వార్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఆగష్ట్ 5న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ఏదో ఒక అప్‌డేట్‌తో ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. దీనిలో భాగంగానే ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అవకాశాల ముందు అవి నథింగ్..!
సినీ సెలబ్రిటీలకు రూమర్స్ కొత్తేమీ కాదు. సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక్కసారి స్టార్ స్టేటస్ అందుకున్న తరువాత రూమర్లు కూడా వెంటనే తిరుగుతూ ఉంటాయి. కొంతమంది సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళిపోతుంటారు. మరికొంతమంది మొదట కాస్త బాధపడినా ఆతరువాత అలవాటైపోతుంది.. పట్టించుకోవడం మానేస్తారు. ఇక స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కూడా రూమర్స్ ను పట్టించుకోనని చెబుతుంది. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక వరుస హిట్లను అందుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఇప్పుడు తెలుగులో మాత్రమే కాదు తమిళ్, హిందీ, కన్నడ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ సక్సెస్…

సత్యదేవ్ 'కృష్ణమ్మ' టీజర్ అప్ డేట్..!
విభిన్నమైన కథలతో అలరించడంలో సత్యదేవ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇటీవలే సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఆగష్ట్ 4వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

దుల్కర్ సల్మాన్ నోట తెలుగు పాట
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సీతారామం” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్‌గా విడుదల కానుంది.”సీతారామం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చియాన్ విక్రమ్ "ధృవ నచ్చిత్తిరమ్" మూవీ అప్ డేట్
ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్ , కొండాడవోమ్ ఎంటర్ టైన్ మెంట్ , ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా "ధృవ నచ్చిత్తిరమ్" తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. పార్తీపన్, రాధికా శరత్ కుమార్ , సిమ్రాన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హర్రీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

'శాకుంతలం'.. ఫ్యాన్స్ కోసం అప్ డేట్..!
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. మరోవైపు సామ్ ఫ్యాన్స్ ఈసినిమా అప్ డేట్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ ను అప్ డేట్ ఇవ్వమని కూడా కోరుతున్నారు. దీంతో మేకర్స్ తాజాగా ఈసినిమా అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం ఈ అప్ డేట్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సీజీ వర్క్ తో ఎన్నో ఛాలెంజ్ లు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అయినా కూడా మీకు మంచి…

వాషింగ్టన్ డీసీలో పూజాహెగ్డే వెకేషన్ ఎంజాయ్
సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజా హెగ్డే , పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన ” మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.

ట్విట్టర్ లో 239.3 K లైక్స్ తో అల్లు అర్జున్ ఫొటో రికార్డ్
బ్లాక్ బస్టర్ “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ అధికం అయ్యింది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అల్లు అర్జున్ , తన ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఇన్ స్టా గ్రామ్ లో 18. 5 మిలియన్ పైగా ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ దూసుకుపోతున్నారు.

బిగ్ ఎంటర్ టైనర్ గా "ధమాకా !"
మాస్ మహారాజా రవితేజ హీరోగా "ధమాకా !" , "రావణాసుర ", "టైగర్ నాగేశ్వర రావు" మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతున్న "MEGA 154 " మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ “#RT 69 ” షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను…

'సీతారామం' సోల్ ఫుల్ సాంగ్ రిలీజ్..!
‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సెన్సిటివ్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో హను రాఘవపూడి స్టైల్ వేరు. ఇప్పుడు మరో ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా సీతారామం సినిమా వస్తుంది. ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పీరియాడిక్ లవ్ స్టోరీతో ఈసినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు.

ప్రభాస్ సక్సెస్ కు అదే కారణం..!
ఈశ్వర్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్ హీరోగా నిలదొక్కుకొని ఆ తరువాత స్టార్ హీరోగా.. స్టార్ హీరో నుండి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ఈ స్థాయికి రావడానికి ప్రభాస్ కూడా ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే పాన్ ఇండియా స్టార్ గా పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ తన సహనటులతో, చిత్రయూనిట్ తో ఎలా ఉంటాడో కూడా పలు సందర్భాల్లో చాలా మంది చెప్పటం చూశాం. తనతో పనిచేసిన ప్రతిఒక్కరూ తనపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేరు. అందుకే అందరికీ డార్లింగ్ అయ్యాడు ప్రభాస్. ఇక ఇప్పుడు అవార్డ్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి కూడా ప్రభాస్ పై…

రాబరీ బ్యాక్ డ్రాప్ లో రామ్-బోయపాటి సినిమా..!
ఇటీవలే 'ది వారియర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఎనర్జిటిక్ హీరో రామ్. అయితే ఈసినిమా సరైనా విజయాన్ని అందించలేకపోయిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మాస్ యక్షన్ ఎంటర్ టైనర్ లు రామ్ కు కొత్తేమీ కాదు. తన కెరీర్ లో పక్కా మాస్ పాత్రలు ఎన్నో చేశారు. ఇక దానికి తోడు ఈసినిమాకు మాస్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరో దొరికితే బోయపాటి ఇంకెన్ని మ్యాజిక్ లు చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

నాలుగురోజులలో 100 కోట్ల క్లబ్ లో "విక్రాంత్ రోణ"
కిచ్చా క్రియేషన్స్ , షాలిని ఆర్ట్స్ , ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నీతా అశోక్ , జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. నిరూప్ భండారి, రవిశంకర్ గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.హీరో సుదీప్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

'కార్తికేయ2' థియేట్రికల్ ట్రైలర్ అప్ డేట్..!
హ్యాపీడేస్‌తో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన యంగ్ హీరో నిఖిల్ ఆసినిమాలో తన నటనతో, తెలంగాణ యాసతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆ సినిమా తరువాత వరుసగా అవకాశాలు అందుకున్నాడు.. అయితే అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయాడు.. ఆ తరువాత స్వామిరారా సినిమాతో తన సినీ కెరీర్ మరో మలుపు తిరిగింది. ఇక అప్పటినుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేస్తూ క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

సోషల్ మీడియాకు బ్రేక్ అంటున్న 'విక్రమ్' డైరెక్టర్..!
అప్పుడప్పుడు సెలబ్రిటీలు కొంతకాలం సోషల్ మీడియాకు దూరమవుతూ ఉంటారు. కొంతమంది నెగిటివిటీ వల్ల, మరికొంత మంది కావాలనే బ్రేక్ తీసుకొని కొంతకాలం తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్ కూడా సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు రీసెంట్ గా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్. ఈవిషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొంతకాలం పాటు తాను అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కి దూరంగా ఉంటున్నానని.. త్వరలోనే తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ తో వస్తానని.. అప్పటివరకూ అందరూ జాగ్రత్తగా ఉండమని.. ప్రేమతో మీ లోకేష్ అంటూ అధికారికంగా తెలియచేశాడు.