‘సీతారామం’ కోసం డార్లింగ్..!

Prabhas is The Chief Guest for Sita Ramams Pre Release Event,Sita Ramam Pre Release Event: Prabhas Announced As Official Chief Guest,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Pre Release Event,Sita Ramam Pre Release Event Updates,Sita Ramam Pre Release Event Cheif Guest,Sita Ramam Pre Release Event Cheif Guest Rebel Star Prabhas, Sita Ramam Pre Release Release Event Guest Pan Indian Star Prabhas,Prabhas to Attent Sita Ramam Movie Pre Release Event,Pan India Star Prabhas To Attend Sita Ramam Telugu Movie Pre Release Event, Prabhas Upcoming Movies,Prabahas Project K Movie Updates,Prabhas to Attend Dulquer Salmaan Sita Ramam Movie Pre Release Event,Dulquer Salmaan,Hero Dulquer Salmaan,Actor Dulquer Salmaan,Dulquer Salmaan latest Updates,Dulquer Salmaan Latest News

మహానటి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక ఈసారి డైరెక్ట్ తెలుగు సినిమాతోనే వచ్చేస్తున్నాడు. హనురాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సీతారామం. 1960 కాలంనాటి వార్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఆగ‌ష్ట్ 5న విడుద‌ల కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఏదో ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల‌లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. దీనిలో భాగంగానే ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు హైద్రాబాద్ లో నిర్వహించనున్నారు. అయితే ఈకార్యక్రమానికి ముందు నుండి అతిథిగా ఎవరు వస్తారు అన్న విషయంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కానీ వస్తారన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆవార్తలకు క్లారిటీ వచ్చేసింది. సీతారామం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డార్లింగ్ ప్రభాస్ వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. డియర్ రామ్ నీకోసం నేను వస్తున్నా ఫ్రమ్ ప్రభాస్ అంటూ లెటర్ లో రాసినట్టు పేర్కొన్నారు.

కాగా వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మిస్తున్న ఈసినిమాలో మృణాళిని ఠాకూర్ కూడా నటిస్తుంది. ఇంకా ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్ర పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఆగ‌ష్ట్ 5న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.