సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ టీజర్ అప్ డేట్..!

Satyadev Krishnamma Teaser Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Krishnamma,Krishnamma Movie,Krishnamma Telugu Movie,Krishnamma Movie Teaser,Krishnamma Telugu Movie Teaser,Satyadev,Hero Satyadev,Satyadev Krishnamma Movie Teaser, Satyadev upcoming Movie Krishnamma,Krishnamma Movie Teaser Updates,Krishnamma Movie Teaser Relesing on 4th August,Kirshnamma Movie Teaser officially Releasing on 4th August

విభిన్నమైన కథలతో అలరించడంలో సత్యదేవ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇటీవలే సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఆగష్ట్ 4వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలబైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =