ప్రభాస్ సక్సెస్ కు అదే కారణం..!

Rasool Pookutty Superb Words About Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rasool Pookutty,Rasool Pookutty Indian Sound Designer,Rasool Pookutty About Darling Prabhas,Rasool Pookutty Super words About Darling Prabhas,Pan Indian Star Prabhas, Prabhas Upcoming Movies,Prabhas New Movie Updates,Prabhas Adipurush,Prabhas Adipurush Movie latest Updates,Prabhas Salaar Movie,Prabhas Salaar Movie Latest Updates,Project K Movie latest updates, Prabhas Upcoming Movies,Prabhas New Movie Updates,Rasool Pookutty Super Words About Rebel Star Prabhas

ఈశ్వర్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్ హీరోగా నిలదొక్కుకొని ఆ తరువాత స్టార్ హీరోగా.. స్టార్ హీరో నుండి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ఈ స్థాయికి రావడానికి ప్రభాస్ కూడా ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే పాన్ ఇండియా స్టార్ గా పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ తన సహనటులతో, చిత్రయూనిట్ తో ఎలా ఉంటాడో కూడా పలు సందర్భాల్లో చాలా మంది చెప్పటం చూశాం. తనతో పనిచేసిన ప్రతిఒక్కరూ తనపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేరు. అందుకే అందరికీ డార్లింగ్ అయ్యాడు ప్రభాస్. ఇక ఇప్పుడు అవార్డ్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి కూడా ప్రభాస్ పై ప్రశంసలు కురిపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా తన ఫాలోవర్లలో ఒకరు ప్రభాస్ గురించి అడుగగా.. ప్రభాస్ డార్లింగ్ అని.. చాలా ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తాడని చెప్పారు. అంతేకాదు తనతో పనిచేసే టెక్నీషియన్ల పట్ల ఎంతో మర్యాదగా ఇంకా నమ్మకంతో ఉంటారని తెలిపారు. అదే తన సక్సెస్ కు కారణం అయింది. తను అంటే నాకు కూడా చాలా ఇష్టం అని తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా రసూల్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాకు పనిచేసిన సంగతి తెలిసిందే.

ఇక ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా ఒకటి. ఇంకా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twelve =