“విక్రాంత్ రోణ”మూవీ సక్సెస్ మీట్

Vikrant Rona Movie Success Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikrant Rona,Vikrant Rona Movie,Vikrant Rona Telugu Movie,Vikrant Rona Movie Latest Updates,Vikrant Rona Telugu Movie Sucess Meet,Vikrant Rona latest Sucess Meet, Vikrant Rona Movie Updates Kiccha Sudeep,Hero Kiccha Sudeep,Kiccha Sudeep Latest Super Hit Movie Vikrant Rona Movie,Kiccha Sudeep in Vikrant Rona Movie Success Meet

కిచ్చా క్రియేషన్స్ , షాలిని ఆర్ట్స్ , ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నీతా అశోక్ , జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. నిరూప్ భండారి, రవిశంకర్ గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.హీరో సుదీప్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.హీరో సుదీప్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టిన ” విక్రాంత్ రోణ” మూవీ నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “విక్రాంత్ రోణ”మూవీ సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది.సక్సెస్ మీట్ లో హీరో సుదీప్‌ మాట్లాడుతూ…తెలుగు సినీ పరిశ్రమ తన కు మరో ఇల్లు వంటిదనీ , ఇక్కడి ప్రేక్షకులు సినిమా నచ్చితే అద్భుత విజయాలు అందిస్తారనీ , మా సినిమా విడుదల సమయంలో నాగార్జున, అఖిల్‌, రాజమౌళి, ఆర్జీవీ లాంటి వాళ్లంతా సపోర్ట్‌ చేశారనీ , మా చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌ చెబుతున్నా అన్నారు. దర్శకుడు అనూప్‌ భండారి మాట్లాడుతూ..రెండు దశాబ్దాలుగా కెరీర్‌ సాగిస్తున్నా..ఈ సినిమాలో ఓ కొత్త హీరోలాగా సుదీప్‌ నటించారనీ , కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేసేప్పుడు గాయపడ్డారనీ , అయినా అదే స్ఫూర్తితో నటించి మాలోనూ ఉత్సాహాన్ని నింపారనీ , మా సినిమా కొత్త అనుభూతిని ఇచ్చిందని ఇవాళ ప్రేక్షకులు చెప్పడం సంతోషంగా ఉందనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 7 =