వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య రీసెంట్ గానే థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా నాగ చైతన్య నిరాశనే మిగిల్చింది. ఈసినిమా సరైన విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం మరో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ ప్రమోషన్ తో బిజీగా ఉన్నాడు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో వస్తున్న లాల్ సింగ్ చడ్డా అనే సినిమాలో చైతు ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాతోనే నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈసినిమా కంటే తనకు ముందే బాలీవుడ్ లో ఛాన్స్ లు వచ్చాయని అయితే నో చెప్పానని అంటున్నాడు చైతు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్ లో ఉంది చిత్రయూనిట్. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ పై స్పందిస్తూ.. తనకు ఎప్పటినుండో బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని.. అయితే తనకు హిందీ పెద్దగా రాదని అందుకే చాలా సినిమాలకు నో చెప్పానని చెప్పాడు. నేను పుట్టిపెరిగిందంతా చెన్నైలోనే ఆతరువాత హైదరాబాద్ కి రావడం జరిగింది.. దీంతో హిందీపై పెద్దగా పట్టు లేదని అన్నాడు. ఫస్ట్ ఈసినిమాకు కూడా నో చెప్పాను అయితే ఈసినిమాలోని బాలరాజు పాత్ర నాకు నచ్చింది.. అందులోనూ సౌత్ నుండి నార్త్ కు వెళ్లే సైనికుడు పాత్ర.. అంతేకాకుండా కొన్ని సీన్స్ లో తెలుగు పదాలు డైలాగ్స్ గా వస్తాయని చెప్పడంతో ఒప్పుకున్నానని తెలిపారు. ఇక షూటింగ్ టైమ్ లో చిత్రయూనిట్ కూడా చాలా సపోర్ట్ చేశారని తెలిపాడు నాగచైతన్య.
కాగా ఈసినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్నాయి. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నఈసినిమాలో మోనా సింగ్, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈసినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే కదా.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: