అప్పుడప్పుడు సెలబ్రిటీలు కొంతకాలం సోషల్ మీడియాకు దూరమవుతూ ఉంటారు. కొంతమంది నెగిటివిటీ వల్ల, మరికొంత మంది కావాలనే బ్రేక్ తీసుకొని కొంతకాలం తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్ కూడా సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు రీసెంట్ గా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్. ఈవిషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొంతకాలం పాటు తాను అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కి దూరంగా ఉంటున్నానని.. త్వరలోనే తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ తో వస్తానని.. అప్పటివరకూ అందరూ జాగ్రత్తగా ఉండమని.. ప్రేమతో మీ లోకేష్ అంటూ అధికారికంగా తెలియచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Hey guys ✨
I’m taking a small break from all social media platforms…
I’ll be back soon with my next film’s announcement 🔥
Till then do take care all of you..
With love
Lokesh Kanagaraj 🤜🏼🤛🏼— Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 1, 2022
కాగా రీసెంట్ గానే లోకేష్ విక్రమ్ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిన ఈసినిమా సూపర్ హిట్ అందుకొని కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. ఇక ఈసినిమాలో కమల్ తో పాటు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించగా.. సూర్య కూడా అతిథి పాత్రలో నటించారు.
ఇక స్టార్ హీరో విజయ్ తో మరో కొత్త సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ తన కమిట్ మెంట్స్ అన్నీఅయిపోయిన తరువాత ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు కార్తి నటించిన ఖైదీ సినిమా సీక్వెల్ కూడా రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.