రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన సినిమా రాక్షసుడు. ఆడపిల్లలను వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లే ఓ సైకో కిల్లర్ కథ ఇది. తమిళంలో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈసినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాదు వరుసగా ఫ్లాప్స్ తో ఉన్న సాయి శ్రీనివాస్ కు ఈసినిమాతోనే ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఈసినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చేసింది. టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఆ తరువాత నుండి ఈసినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఇక నేటితో ఈసినిమా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరోసారి ఈసినిమాపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ రమేష్ వర్మ. స్పైన్ థ్రిల్లర్ రాక్షసుడు సినిమా మూడేళ్లు పూర్తిచేసుకుంది.. రాక్షసుడు 2 సినిమాను డబుల్ థ్రిల్ ఇంకా సస్పెన్స్ తో తీసుకురావడానికి చాలా ఎగ్జైట్ గా ఉన్నాం.. షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేయనున్నాం అంటూ తెలిపాడు.
3 Years For Spine-Chilling Thriller #Rakshasudu 🎭
We’re Excited to Bring the #Rakshasudu2 with Double the Thrill and Suspense 💥
Shoot Starts Soon 🔥
Hold your Breath because We are coming with a Bang ❤️🔥 pic.twitter.com/TX7JzK0fhN
— Ramesh Varma (@DirRameshVarma) August 2, 2022
ఇక ఈసీక్వెల్ ను కూడా రాక్షసుడు సినిమాను తెరకెక్కించిన హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఏ స్టూడియోస్’ అధినేత కోనేరు సత్యనారాయణ ‘రాక్షసుడు 2’ సినిమాను నిర్మించనున్నాడు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫి, శ్రీకాంత్ విస్సా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నాడు. అయితే ఇందులో మరోసారి హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తాడా? లేదా వేరే స్టార్ హీరో నటిస్తాడా? అన్నది తెలియాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: