బన్నీ- సుకుమార్-రత్నవేలు ఈ మ్యాజికల్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మరోసారి ఈ కాంబినేషన్ కలిసింది. అయితే ఏదో సినిమా కోసం కాదులెండి. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అల్లు అర్జున్ పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేథ్యంలో ఓ కమర్షియల్ యాడ్ కోసం బన్నీ, సుకుమార్, రత్నవేలు కలిసి పనిచేస్తున్నారు. ఈసందర్భంగా సెట్ లో వీరు ముగ్గురు కలిసి తీసుకున్న ఫొటోను సుకుమార్ సతీమణి బబిత సుకుమార్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాదాపు 17ఏళ్ల తరువాత ఈ మ్యాజికల్ ట్రియో కలిసి పనిచేస్తున్నారంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఈఫొటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వీరిముగ్గురి కాంబినేషన్ లో ఆర్య సినిమా వచ్చిన ఎంత సంచలన విజయం దక్కించుకుందో తెలిసిందే. ఫీల్ మై లవ్ అంటూ అల్లు అర్జున్ నటన, డ్యాన్సులు, గ్రేసు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు కెమెరా పనితనం ఇలా అన్ని కలిసి ఆర్యను ట్రెండ్ సెట్టర్‌గా నిలబెట్టేశాయి. అప్పటి నుండి సుకుమార్-రత్నవేలు బంధం కొనసాగుతూనే ఉంది.
View this post on Instagram
కాగా రీసెంట్ గానే సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో పుష్ప సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈసినిమా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్ననటించగా.. ఇంకా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. ఇక త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప-దిరూల్’ షూటింగ్ ను కూడా ప్రారంభం చేయనున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: