సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజా హెగ్డే , పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన ” మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా గా ఉన్న పూజా హెగ్డే 30 రోజుల లాంగ్ హాలీడేను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.లండన్ టూర్‌లో షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. పూజాహెగ్డే ట్రీహగ్గర్ క్యాప్షన్ తో తన ఫోటోస్ సోషల్ మీడియా లో షేర్ చేయడం తో, ఆ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































