ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 91

అందుకే బాలీవుడ్ వదులుకున్నా..!

అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్ చిరంజీవి

సూపర్ స్టార్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్..!

నేను సినిమాల్లోకి వస్తానంటే నాన్న వద్దన్నారు..!

సెప్టెంబర్ నెల నుండి "ఆదిపురుష్" ప్రమోషన్స్

విమర్శకుల ప్రశంసలు అందుకున్న "సీతారామం"

షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ్ ది ఘోస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మాచర్ల నియోజకవర్గం'

'సీతారామం' ఖాతాలో 25 కోట్లు..!

"లాల్ సింగ్ చడ్డా" మూవీ పై నాగార్జున ప్రశంసలు

మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించిన "బింబిసార"

బాలీవుడ్ మూవీ "గుడ్ బై " కు రష్మిక స్వంత వాయిస్

'తీస్ మార్ ఖాన్' ట్రైలర్ రిలీజ్
'జైలర్' రెగ్యులర్ షూటింగ్ అప్ డేట్..!
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఒకేసారి రెండుమూడు సినిమాలు చేయకపోయినా ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఈనేపథ్యంలోనే తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇటీవలే రజనీ కాంత్ అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది. ఇక్కడ బాగానే ఈసినిమాకు మంచి టాక్ లభించింది.

"ధమాకా" మూవీ లో తన పాత్ర కై డబ్బింగ్ ప్రారంభించిన శ్రీ లీల
మాస్ మహారాజా రవితేజ హీరోగా “ధమాకా !” , “రావణాసుర “, “టైగర్ నాగేశ్వర రావు” మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతున్న “MEGA 154 ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ "ధమాకా" తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

యూరోప్ లో "పుష్ప :ది రూల్"మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్…

అందుకే బాలీవుడ్ వదులుకున్నా..!
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీషన్ లో గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. కొత్త కొత్త టాలెంట్ రోజూ ఇండస్ట్రీకి పరియచమవుతున్న తరుణంలో వరుస అవకాశాలు దక్కించుకోవడం కూడా అంత తేలిక కాదు. హార్డ్ వర్క్ ఉండాలి.. టాలెంట్ ఉండాలి వీటితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో రాణించగలరు. ఈనేపథ్యంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలానికే క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో బిజీ హీరోయిన్ గా వరుస అవకాశాలను దక్కించుకుంటుంది కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కృతిశెట్టి మొదటి సినిమాతోనే తెలుగులో సంచలన విజయం దక్కించుకుంది. ఆసినిమాలో…

థాంక్యూ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన సినిమా థాంక్యూ. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల విజయాలతో ఫామ్ లో ఉన్న నాగ చైతన్యకు థాంక్యూ సినిమా మాత్రం నిరాశనే మిగిల్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా చైతుకు అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. మన జీవితంలో మనం ఎదగడానికి.. మన ఎదుగుదలలో తోడుగా నిలిచిన వారిని ఎప్పుడూ మరిచిపోకుడదన్న పాయింట్ తో ఈసినిమాను తెరకెక్కించారు. మంచి పాయింట్ తో ఈ సినిమా వచ్చినా ఈసినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

"బింబిసార" మూవీ సక్సెస్ పునర్జన్మ వంటిది - కళ్యాణ్ రామ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “బింబిసార” మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.భారీ…

అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్ చిరంజీవి
మెగా స్టార్ చిరంజీవి హీరోగా "గాడ్ ఫాదర్ ", "MEGA 154 ", "భోళా శంకర్ "మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాల షూటింగ్స్ తో చిరంజీవి బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తం గా అభిమానులు ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. సెలబ్రిటీలనే కాదు ఫ్యాన్స్‌ను సైతం ఆత్మీయంగా పలకరిస్తారు. అభిమానికి ఆపద వస్తే అండగా నిలబడతారు . తాజాగా చిరు తన అభిమాని చివరి కోరికను నెరవేర్చి తన మంచి మనసు ను చాటుకున్నారు.

సూపర్ స్టార్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మహేష్ ఏమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఈరోజు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లోనే రికార్డ్ క్రియేట్ చేసిన పోకిరి ఇంకా ఒక్కడు సినిమాలను స్పెషల్ షోస్ ను నిర్వహిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు కూడా స్పెషల్ షోస్ కు సూపర్ రెస్పాన్స్ రావడం. ఇక ఈ షోస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఎంబీ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లల గుండె ఆపరేషన్, పేద పిల్లల విద్యకు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపిన సంగతి కూడా విదితమే.

నేను సినిమాల్లోకి వస్తానంటే నాన్న వద్దన్నారు..!
వారసులు ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉండేదే. అయితే ఎక్కడో కొంతమంది మాత్రమే వేరే వృత్తులను ఎంచుకుంటారు. అయితే ఓ స్టార్ హీరో మాత్రం తను సినిమాల్లోకి రావడం తన తండ్రికి ఇష్టం లేదని అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు తాజాగా సీతారామం సినిమాతో మంచి హిట్ కొట్టిన దుల్కర్ సల్మాన్. అయితే తను నటించిన సీతారామం సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మహానటితోనే ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ ఇక ఈసినిమాతో మరింత దగ్గరైపోయాడు.

సెప్టెంబర్ నెల నుండి "ఆదిపురుష్" ప్రమోషన్స్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటించిన…

విమర్శకుల ప్రశంసలు అందుకున్న "సీతారామం"
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ్ ది ఘోస్ట్
టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది బంగార్రాజు సినిమాతో అలరించిన నాగ్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తుంది. ఇప్పటికే హిందీలో తను చాలా సంవత్సరాల తరువాత బ్రహ్మాస్త్ర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో భారీ బడ్జెట్ ఇంకా భారీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా మొదటి పార్ట్ సెప్టెబర్ 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇక తెలుగులో కూడా ది ఘోస్ట్ సినిమా చేస్తున్నాడు నాగ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మాచర్ల నియోజకవర్గం'
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం. ఈసినిమాలో నితిన్ మొదటిసారి ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు అన్నీ కాస్త క్లాస్ పాత్రలే. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఫుల్ మాస్ రోల్ తో అలరించడానికి వస్తున్నాడు. ఇక ఈసినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక “రారా రెడ్డి” పాట అయితే మరో రేంజ్ లో దూసుకుపోతుంది. దీంతో సినిమా సినీ…

'సీతారామం' ఖాతాలో 25 కోట్లు..!
మొత్తానికి చాలా రోజుల తరువాత ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఉంది. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు దాదాపు నిరాశనే మిగిల్చాయి. దానికి తోడు ఇండస్ట్రీలో ఉన్న పలు సమస్యలు వల్ల, టికెట్ రేట్లలో కూడా గందరగోళం ఇలా పలు కారణాల వల్ల దాదాపు చాలా వరకూ థియేటర్లకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించంలేదు. అయితే గత శుక్రవారం రిలీజ్ అయిన రెండు సినిమాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు మల్లీ థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి బూస్ట్ నిచ్చాయి. ఆరెండు సినిమాలు బింబిసార, సీతారామం. రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.

"లాల్ సింగ్ చడ్డా" మూవీ పై నాగార్జున ప్రశంసలు
వయాకామ్ 18 స్టూడీయోస్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య, మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్” కు రీమేక్‌గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చడ్డా ” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“లాల్ సింగ్ చడ్డా ” మూవీ తెలుగు వెర్షన్ ను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న విషయం తెలిసిందే.

"జిన్నా"మూవీ పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ రిలీజ్
అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా "జిన్నా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ కథానాయిక కాగా సన్నీ లియోన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో విష్ణు ప్రేక్షకులను అలరించనున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

'బ్రహ్మాస్త్ర' దేవ దేవ సాంగ్ రిలీజ్..!
బాలీవుడ్ నుండి రాబోతున్న భారీ ఫాంటసీ మూవీ బ్రహ్మాస్త్ర. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్పెప్ట్ తో.. భారతీయ పురాతన సంస్కృతుల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించాడు. దాదాపు పదేళ్ల కష్టం తరువాత అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైనల్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాను ముందు ఒక సినిమాగానే రిలీజ్ చేద్దామనుకున్నా కథ.. కంటెంట్ వల్ల మూడు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.

మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించిన "బింబిసార"
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “బింబిసార” మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ మూవీ "గుడ్ బై " కు రష్మిక స్వంత వాయిస్
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “వారసుడు “, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ , రణ్ బీర్ కపూర్ “యానిమల్ “, టైగర్ ష్రాఫ్ “స్క్రూ ఢీలా” బాలీవుడ్ మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్…

'తీస్ మార్ ఖాన్' ట్రైలర్ రిలీజ్
సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది సాయికుమార్. ఇక మొదటిసినిమా నువ్వే కావాలి తోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆతరువాత నుండి సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆది ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. దాదాపు అరడజను సినిమాలు వరకు ఆది చేస్తున్నాడు. వాటిలో త్వరలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా తీస్ మార్ ఖాన్. కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో ఆది సాయికుమార్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ లో ఆది నటిస్తున్నాడు.