విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన సినిమా థాంక్యూ. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల విజయాలతో ఫామ్ లో ఉన్న నాగ చైతన్యకు థాంక్యూ సినిమా మాత్రం నిరాశనే మిగిల్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా చైతుకు అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. మన జీవితంలో మనం ఎదగడానికి.. మన ఎదుగుదలలో తోడుగా నిలిచిన వారిని ఎప్పుడూ మరిచిపోకుడదన్న పాయింట్ తో ఈసినిమాను తెరకెక్కించారు. మంచి పాయింట్ తో ఈ సినిమా వచ్చినా ఈసినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీ రిలీజ్ కూడా వచ్చేసింది. ఈసినిమా జులై 22న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. థియేటర్స్‌లో విడుదలై మూడు వారాలు గడకముందే కంటే ముందే ఈ చిత్రంలో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నేపథ్యంలో ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా ను రిలీజ్ చేస్తున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
they are here to drown you into a pleasant sea of wholesomeness with a very distinct storyline 🌼#ThankYouOnPrime, Aug 11 pic.twitter.com/S4WOcwpEAc
— prime video IN (@PrimeVideoIN) August 9, 2022
కాగా ఇక ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించగా.. మాళవికా నాయర్, అవికా గోర్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ ఈసినిమాకు సంగీతం అందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: