అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi FulFills His Fans Last Wish,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Latest Updates,Chiranjeevi Latest Movie Updates,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi Fan last wish, Mega Star Chiranjeevi Godfather latest Updates,Godfather Movie,Godfatehr Telugu Movie,Godfather Movie Updates,Chiranjeevi MEGA 154,Chiranjeevi Bhola Shankar Movie Latest Updates, Nagaraju Fan of Chiranjeevi Fullfill His wish

మెగా స్టార్ చిరంజీవి హీరోగా “గాడ్ ఫాదర్ “, “MEGA 154 “, “భోళా శంకర్ “మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాల షూటింగ్స్ తో చిరంజీవి బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తం గా అభిమానులు ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి.. సెలబ్రిటీలనే కాదు ఫ్యాన్స్‌ను సైతం ఆత్మీయంగా పలకరిస్తారు. అభిమానికి ఆపద వస్తే అండగా నిలబడతారు . తాజాగా చిరు తన అభిమాని చివరి కోరికను నెరవేర్చి తన మంచి మనసు ను చాటుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి స్వంత ఊరు అయిన మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్‌కు వీరాభిమాని. రెండు కిడ్నీలు పాడైన ఈయన చివరిసారిగా చిరంజీవిని చూడాలని ఉందని మనసులోని కోరిక బయటపెట్టారు . ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి,వెంటనే తన అభిమాని కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానించారు . మృత్యువుతో పోరాడుతున్న నాగరాజును చూసి చలించిపోయిన చిరు ఆయన్ను ఆప్యాయంగా హత్తుకున్నారు. కాసేపు అభిమానితో మాట్లాడి ఆయనకు మానసిక స్థైర్యాన్ని అందిం చడంతో పాటు ఆర్థిక సహాయం కూడా కల్పించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.