‘తీస్ మార్ ఖాన్’ ట్రైలర్ రిలీజ్

Tees Maar khan Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tees Maar khan,Tees Maar khan Movie,Tees Maar khan Telugu Movie,Tees Maar khan Movie Updates,Tees Maar khan Trailer,Tees Maar khan Movie Trailer, Tees Maar khan Latest Trailer Updates,Tees Maar khan Trailer Released,Tees Maar khan Telugu Movie Trailer Out Now,Tees Maar khan Movie Trailer Ount Now, Tees Maar khan Trailer Watch online,Aadi Sai Kumar,Hero Aadi Sai Kumar,Aadi Sai Kumar Upcoming Movie Tees Maar Khan Trailer Updates, Aadi Sai Kumar Tees Maar Khan Trailer,Aadi Sai Kumar Upcoming Movies,Aadi SaimKumar New Movie Updates

సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది సాయికుమార్. ఇక మొదటిసినిమా నువ్వే కావాలి తోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆతరువాత నుండి సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆది ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. దాదాపు అరడజను సినిమాలు వరకు ఆది చేస్తున్నాడు. వాటిలో త్వరలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా తీస్ మార్ ఖాన్. కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో ఆది సాయికుమార్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ లో ఆది నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇచ్చారు చిత్రబృందం. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అంతేకాదు ఈసినిమా నుండి రెండు టీజర్ లను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కాగా ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఆగష్ట్ 19న ఈ మూవీ విడుదల కాబోతోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =