‘సీతారామం’ ఖాతాలో 25 కోట్లు..!

Sitaramam Movie 3 Days World Wide Collections,Sita Ramam Movie Collections For 3 Days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Collections,Sita Ramam Movie Collections Updates,Sita Ramam latest Movie Collections, Sita Ramam Movie 3 days Collections,Sita Ramam Box Office Collections Dulquer salmaan Sita Ramam Movie Collections,Dulquer Salmaan,Hero Dulquer Salmaan, Dulquer Salmaan Latest Movie Sita Ramam Box office Collections Updates,Sita Ramam Movie 3 Days Collections Updates

మొత్తానికి చాలా రోజుల తరువాత ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఉంది. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు దాదాపు నిరాశనే మిగిల్చాయి. దానికి తోడు ఇండస్ట్రీలో ఉన్న పలు సమస్యలు వల్ల, టికెట్ రేట్లలో కూడా గందరగోళం ఇలా పలు కారణాల వల్ల దాదాపు చాలా వరకూ థియేటర్లకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించంలేదు. అయితే గత శుక్రవారం రిలీజ్ అయిన రెండు సినిమాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు మల్లీ థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి బూస్ట్ నిచ్చాయి. ఆరెండు సినిమాలు బింబిసార, సీతారామం. రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా సీతారామం మాత్రం క్లాసిక్ లవ్ స్టోరీగా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది. హను రాఘవపూడి మార్క్‌ డైరెక్షన్‌, దుల్కర్ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్ ల సహజ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీరితో పాటు ఈసినిమాలో నటించిన ప్రతిఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నా మొదటి రోజు మాత్రం కలెక్షన్స్ నార్మల్ గానే వచ్చాయి. అయితే మొదటిరోజు వచ్చిన టాక్ తో రెండు రోజుల్లో ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా పుంజుకుంది. దీంతో మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది.

కాగా ఈసినిమాను వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మించారు. ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, సుమంత్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్, ప్రియదర్శి పలువురు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అందించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =