
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 66


మహేష్ బాబు న్యూ లుక్

నానే వరువేన్ రిలీజ్ డేట్ ఫిక్స్!

రాజకీయం నా నుండి దూరం కాలేదు

కశ్మీర్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్

అనుష్క ఇన్ స్టా గ్రామ్ కొత్త ప్రొఫైల్ పిక్

స్టార్ కిడ్ అల్లు అర్హ క్యూట్ వీడియో

#NC 22 యాక్షన్ బిగిన్స్

సూర్య 42 కొత్త షెడ్యూల్ స్టార్ట్

రాజమండ్రి లో # MEGA 154 మూవీ తాజా షెడ్యూల్

నిఖిల్ స్పై టార్గెట్ దసరా సీజన్

100 వ సినిమాపై నాగార్జున స్పందన

బ్రేక్ ఈవెన్ సాధించిన ఒకే ఒక జీవితం

టైగర్ నాగేశ్వరరావు జర్నీ మొదలుపెట్టిన రేణూ

గంగూబాయి గా మారిన నిహారిక

సత్యదేవ్ 26 కొత్త సినిమా అధికారిక ప్రకటన

కేరళ లో కార్తికేయ 2 మూవీ కి భారీ ప్రమోషన్స్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది…

మహేష్ బాబు న్యూ లుక్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

నానే వరువేన్ రిలీజ్ డేట్ ఫిక్స్!
విలక్షణమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు ధనుష్. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా నానే వరువేన్. ఈసినిమాను తెలుగులో నేనే వస్తున్న అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ధనుష్ హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.

రాజకీయం నా నుండి దూరం కాలేదు
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గాడ్ ఫాదర్. ఇటీవల రిలీజ్ అయిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈసినిమా అయినా హిట్ కావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ఈసినిమాను తెరకెక్కించాడు మోహన్ రాజా. ఇక ఈసినిమా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ప్రతి అప్ డేట్ తో క్యూరియాసిటీని పెంచుతున్నారు.

కశ్మీర్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.అల్లూరి సీతారామరాజుగా రామ్…

స్వీయ దర్శక నిర్మాణంలో హీరోగా వివి వినాయక్ కొత్త మూవీ?
సూపర్ హిట్ ఆది మూవీ తో దర్శకుడు గా టాలీవుడ్ కు పరిచయం అయిన వివి వినాయక్ ఆ మూవీ తో బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. ఆది మూవీ 96 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకొనడం విశేషం. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి , దిల్ , ఠాగూర్ , సాంబ , బన్నీ , లక్ష్మి , కృష్ణ , అదుర్స్ , నాయక్ , ఖైదీ నెం 150 మూవీస్ ఘనవిజయం సాధించాయి. వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సూపర్ హిట్ ఛత్రపతి మూవీ హిందీ రీమేక్ ఛత్రపతి మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తో దర్శకుడిగా వినాయక్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

అనుష్క ఇన్ స్టా గ్రామ్ కొత్త ప్రొఫైల్ పిక్
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్(2005) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క పలు తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అనుష్క కథానాయికగా నటించిన విక్రమార్కుడు , లక్ష్యం , బిల్లా , వేదం , మిర్చి , బాహుబలి, బాహుబలి 2, సోగ్గాడే చిన్ని నాయనా వంటి మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారిన అనుష్క అరుంధతి, రుద్రమదేవి , భాగమతి , నిశ్శబ్దం వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

స్టార్ కిడ్ అల్లు అర్హ క్యూట్ వీడియో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్నేహా రెడ్డి ల తనయ అర్హ తన చిరు నవ్వుతో , ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి (అల్లు అర్జున్ ) పాల్గొనే పలు కార్యక్రమాలలో పాల్గొంటున్న అర్హ , గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన శాకుంతలం మూవీ లో భరతుడిగా నటించింది.

#NC 22 యాక్షన్ బిగిన్స్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది తెలుగులో రెండు సినిమాలు బంగార్రాజు, థాంక్యూ ఇంకా బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిలో థాంక్యూ సినిమా ఇంకా లాల్ సింగ్ చద్దా సినిమాలు రెండూ అంత విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక చైతు కూడా అవేమీ పట్టించుకోకుండా తన సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం అయితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

‘కెప్టెన్ మిల్లర్’ హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ఫిక్స్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇటీవలే గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా తిరు సినిమా కూడా మంచి హిట్ ను అందించింది. దీంతో ఫుల్ ఫామ్ లో ఉన్న ధనుష్ అదే దిశగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా ‘నానే వరువెన్’. సెల్వా రాఘవన్ దర్శకత్వం వహించిన ఈసినిమాను ‘నేను వస్తున్నా’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈసినిమాపై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం…

సూర్య 42 కొత్త షెడ్యూల్ స్టార్ట్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈమధ్య కాలంలో విభిన్నమైన పాత్రలు, డిఫరెంట్ కథలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన పలు ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నాడు. అందులో స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఇది సూర్య కెరీర్‌లో 42వ చిత్రంగా వస్తుంది. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు మోషన్ పోస్టర్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.

రాజమండ్రి లో # MEGA 154 మూవీ తాజా షెడ్యూల్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ నామినేషన్స్ కై ఎదురుచూస్తున్న ప్రేక్షకులు
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్…

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం-బొక్కా రమేష్ గా వెన్నెల కిషోర్
ఒకప్పుడు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే రాజ్‌మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే రెండు ప్రీ టీజర్ అలానే టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. అయితే వెన్నెల కిషోర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి…

నిఖిల్ స్పై టార్గెట్ దసరా సీజన్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మొత్తానికి లేట్ గా వచ్చినా కూడా కార్తికేయ2 సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సీక్వెల్ కార్తికేయ2 ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే కదా. కేవలం ఇక్కడ మాత్రమే కాదు నార్త్ లో ఈసినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. దీంతో నార్త్ ప్రేక్షకుల్లో కూడా నిఖిల్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఈసినిమా ఎక్కడా తగ్గలేదు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

100 వ సినిమాపై నాగార్జున స్పందన
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కింగ్ నాగార్జున ఈ సంవత్సరం సూపర్ హిట్ బంగార్రాజు , బ్రహ్మాస్త్ర మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహన్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నాగార్జున , సొనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

బ్రేక్ ఈవెన్ సాధించిన ఒకే ఒక జీవితం
డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీ కార్తిక్ దర్శకత్వంలో శర్వానంద్ , రీతూ వర్మ జంటగా , సీనియర్ హీరోయిన్ అమల ఒక కీలక పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.హీరో శర్వానంద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అద్భుతమైన తన బాడీ లాంగ్వేజ్ , కొన్ని ఎమోషనల్ సీన్స్ లో శర్వానంద్ చాలా బాగా నటించి ప్రేక్షకులను అలరించారు.తల్లి పాత్రలో నటించిన అమల తన నటనతోనూ మరియు తన స్మైల్ తోనూ ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ…

టైగర్ నాగేశ్వరరావు జర్నీ మొదలుపెట్టిన రేణూ
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు రవితేజ. ప్రథమార్థంలో ఖిలాడి సినిమా రిలీజ్ అవ్వగా.. ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీ సినిమాను రిలీజ్ చేయగా రెండు సినిమాలు కూడా సరైన విజయాన్ని అందించలేకపోయాయి. ఇక ప్రస్తుతం అయితే తన కొత్త సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈసినిమా స్టూవర్ట్ పురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత చరిత్ర ఆధారంగా…

గంగూబాయి గా మారిన నిహారిక
ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిననిహారిక ఆసినిమాలో తన నటనతో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, ప్రణీత్ దర్శకత్వంలో సూర్యకాంతం, తమిళ్ లో ఒక సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా నిహారికకు విజయం అందించలేకపోయాయి. అయితే సూర్యకాంతం సినిమాలో నిహారిక నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకూ మరే సినిమా చేయలేదు. ఇక వివాహబంధంలోకి అడుగుపెట్టేయడంతో సినిమాలకు మరింత దూరమైనట్టే. ప్రస్తుతం అయితే నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లు అంటూ.. పలు ప్రాజెక్ట్ లను ప్రేక్షకులకు అందిస్తున్నారు

సత్యదేవ్ 26 కొత్త సినిమా అధికారిక ప్రకటన
విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన వెర్సటైల్ హీరో సత్యదేవ్. మొదటి నుండి విలక్షణ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటూ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే వస్తున్నాడు సత్యదేవ్. ప్రస్తుతం సత్యదేవ్ పలు సినిమాలతో బిజీగానే ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో యూనిక్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.