‘కెప్టెన్ మిల్లర్’ హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ఫిక్స్

Priyanka Mohan Fixed As Heroine In Captain Miller, Priyanka Mohan As Heroine In Captain Miller, Captain Miller Movie, Captain Miller Movie Heroine Priyanka Mohan, Captain Miller Telugu Movie Heroine Priyanka Mohan, Actress Priyanka Mohan, Priyanka Mohan, Captain Miller Movie, Captain Miller Telugu Movie, Captain Miller Movie Latest Update, Captain Miller New Update, Captain Miller Movie Updates, Captain Miller Telugu Movie Updates, Captain Miller Telugu Movie Live Updates, Captain Miller Latest News And Updates, Captain Miller, Dhanush, Arun Matheswaran, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇటీవలే గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా తిరు సినిమా కూడా మంచి హిట్ ను అందించింది. దీంతో ఫుల్ ఫామ్ లో ఉన్న ధనుష్ అదే దిశగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా ‘నానే వ‌రువెన్’. సెల్వా రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమాను ‘నేను వ‌స్తున్నా’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈసినిమాపై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు మరో సినిమాతో రాబోతున్నాడు ధనుష్. కెప్టెన్ మిల్లర్ అనే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మరోవైపు ఇక ఈసినిమా నుండి కాస్టింగ్ కు సంబంధించి వరుసగా అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమాలో మరో కీలక పాత్రలోటాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాాజాగా ఈసినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ప్రియాంక మోహన్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

కాగా ఈసినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెతో నిర్మిస్తున్న ఈసినిమాను త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా రూపొందించనున్నారు. జీ. వి ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. శ్రేయాస్ కృష్ణ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =