సూపర్ హిట్ ఆది మూవీ తో దర్శకుడు గా టాలీవుడ్ కు పరిచయం అయిన వివి వినాయక్ ఆ మూవీ తో బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. ఆది మూవీ 96 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకొనడం విశేషం. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి , దిల్ , ఠాగూర్ , సాంబ , బన్నీ , లక్ష్మి , కృష్ణ , అదుర్స్ , నాయక్ , ఖైదీ నెం 150 మూవీస్ ఘనవిజయం సాధించాయి. వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సూపర్ హిట్ ఛత్రపతి మూవీ హిందీ రీమేక్ ఛత్రపతి మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తో దర్శకుడిగా వినాయక్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొన్నాళ్ల క్రితం దిల్ రాజు బ్యానర్ లో శరభ మూవీ ఫేమ్ ఎన్ నరసింహ దర్శకత్వంలో డైరెక్టర్ వినాయక్ హీరోగా సీనయ్య అనే సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. శీనయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కరోనా కారణంతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కకుండానే ఆగిపోయింది.తాజాగా స్వీయ దర్శక నిర్మాణంలో హీరోగా వివి వినాయక్ కొత్త మూవీ తెరకెక్కనుందని సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: