నిఖిల్ స్పై టార్గెట్ దసరా సీజన్

Nikhil's Spy to be released for Dasara, Nikhil's Spy Movie to be released for Dasara, Spy Telugu Movie to be released for Dasara, Nikhil's Spy Movie, Spy Telugu Movie, Dasara, Nikhil's Upcoming movie, Nikhil's Latest Movie, Spy Movie Update, Spy Telugu Movie Latest Update, Nikhil Siddhartha And Anupama Parameswaran Starrer Karthikeya 2, Nikhil Siddhartha And Anupama Parameswaran's Karthikeya 2 Movie, Karthikeya 2 Movie, Karthikeya 2 Telugu Movie, Spy Telugu Movie Updates, Spy Telugu Movie Live Updates, Spy Movie Latest News And Updates, Spy, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మొత్తానికి లేట్ గా వచ్చినా కూడా కార్తికేయ2 సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సీక్వెల్ కార్తికేయ2 ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే కదా. కేవలం ఇక్కడ మాత్రమే కాదు నార్త్ లో ఈసినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. దీంతో నార్త్ ప్రేక్షకుల్లో కూడా నిఖిల్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఈసినిమా ఎక్కడా తగ్గలేదు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నిఖిల్ ఖాతాలో ఇంకా పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నిఖిల్ స్పై కూడా ఒకటి. గారీ బి.హెచ్ దర్శకత్వంలో స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు. అప్పుడే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేశారు. అంతేకాదు ఈసినిమా నుండి నిఖిల్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మధ్యలో కార్తికేయ2 రిలీజ్ ఉండటంతో ఆ ప్రమోషన్ కార్యక్రమాల వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూట్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే కేరళలో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే తాజా సమాచారం ఈసినిమాను దసరా సీజన్ లో బరిలోకి దించాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ దిశగానే గారీ కూడా షూటింగ్ ను పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇంకా ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రూపొందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − one =