మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గాడ్ ఫాదర్. ఇటీవల రిలీజ్ అయిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈసినిమా అయినా హిట్ కావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ఈసినిమాను తెరకెక్కించాడు మోహన్ రాజా. ఇక ఈసినిమా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ప్రతి అప్ డేట్ తో క్యూరియాసిటీని పెంచుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా గాడ్ ఫాదర్ నుండి ప్రస్తుతం ఒక డైలాగ్ కు సంబంధించిన ఆడియో బిట్ ను పోస్ట్ చేశారు. ఇక అందులో ఉన్న డైలాగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ అడియోలో ఉన్న డైలాగ్ ఏంటంటే.. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ ఉంది. ఇక చిరు ఇలా ఆ డైలాగ్ పోస్ట్ చేశారో లేదో అలా ఆ డైలాగ్ వెంటనే వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022
కాగా సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: