విలక్షణమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు ధనుష్. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా నానే వరువేన్. ఈసినిమాను తెలుగులో నేనే వస్తున్న అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ధనుష్ హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నామంటూ చెబుతూ వస్తున్నారు మేకర్స్. అయితే రిలీజ్ డేట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు. కానీ సెప్టెంబర్ 29న రిలీజ్ చేసే అవకాశం ఉందంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలనే నిజం చేస్తూ మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 29వ తేదీనే ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో దనుష్ సరసన ఇందుజ రవిచంద్రన్ , ఎల్లి అవరం హీరోయిన్లుగా నటిస్తుండగా.. సెల్వ రాఘవన్, ప్రభు, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘వి క్రియేషన్స్’ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈసినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: