
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 45


హనుమాన్ మూవీ టీజర్ హింట్

5 రోజులలో 50 కోట్ల క్లబ్ లో సర్దార్

ఊర్వశివో రాక్షసివో-శిరీష్ కోసం బాలయ్య

విజయ్ వారసుడు పై వంశీ క్లారిటీ

హరిహర వీరమల్లు షూట్ లో పాల్గొన్న పవన్

వెకేషన్ లో అనుపమ పరమేశ్వరన్ ఎంజాయ్

దసరా మూవీ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

కాంతార పై తలైవా ప్రశంసలు

500 కోట్ల క్లబ్ దిశగా పొన్నియిన్ సెల్వన్ 1

సర్దార్ 2 అఫీషియల్ అనౌన్స్ మెంట్

ఆర్ఆర్ఆర్ ఖాతాలో ఇంటర్నేషనల్ అవార్డ్

అప్పుడు శివుడు.. ఇప్పుడు అయ్యప్ప

రవితేజ ధమాకా మూవీ రిలీజ్ డేట్

నా లైఫ్ అంతా ప్రభాస్ అభిమానినే

మనసు చాటుకున్న మెగా ప్రిన్స్

కాంతార మూవీ పై స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే స్పందన

వాల్తేరు వీరయ్య కు సూపర్ రెస్పాన్స్

ఓటీటీలో 100 M స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతున్న బింబిసార
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో ఘనవిజయం సాధించి , భారీ వసూళ్ళు రాబట్టిన విషయం తెలిసిందే. బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.. బింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.మొదటి వారం లో బింబిసార మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

హనుమాన్ మూవీ టీజర్ హింట్
టాలీవుడ్ లో విభిన్నమైన కథలు తీయడంలో యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు ముందుకు దూసుకుపోతున్నారు. అందులో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి వినూత్న సినిమాలను తెరకెక్కించి టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం మరో కొత్త జోనర్ లో సినిమాతో రాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

5 రోజులలో 50 కోట్ల క్లబ్ లో సర్దార్
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తి హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దాదాపుగా 15 ఏళ్ల తరువాత సర్దార్ మూవీతో సీనియర్…

ఊర్వశివో రాక్షసివో-శిరీష్ కోసం బాలయ్య
రాకేశ్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. నిజానికి ఈసినిమాకు ముందు ఎందుకంటే ప్రేమంట అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అప్పట్లో ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ మధ్యలో ఈసినిమా నుండి అప్ డేట్స్ రావడం ఆగిపోయాయి. అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే సడెన్ గా ఎందుకంటే ప్రేమంట అనే టైటిల్ ను ఊర్వశివో రాక్షసివో గా మార్చి రిలీజ్ కు సిద్దం చేశారు. ప్రస్తుతం అయితే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది.

విజయ్ వారసుడు పై వంశీ క్లారిటీ
విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారసుడు. తమిళ్ లో ఈసినిమా వారిసు అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఫ్యామిలీ అండ్ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి రిలీజైన పోస్టర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హరిహర వీరమల్లు షూట్ లో పాల్గొన్న పవన్
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటిసారి తన కెరీర్ లోనే ఒక కొత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. వీరమల్లు గా రాబిన్ హుడ్ లాంటి తరహా పాత్రలో పవర్ స్టార్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదులుపెట్టారు చిత్రయూనిట్.. కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోలేకపోయింది. దాదాపు సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్.

నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేసిన ఓరి దేవుడా .. ! హీరోయిన్స్
పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. మిథిలా పాల్కర్ , ఆశా భట్ కథానాయికలు. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.

వెకేషన్ లో అనుపమ పరమేశ్వరన్ ఎంజాయ్
టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ , శతమానం భవతి , హలో గురు ప్రేమ కోసమే , రాక్షసుడు వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 రూ. 58.40 కోట్ల షేర్ (రూ. 121.50 కోట్ల గ్రాస్)…

దసరా మూవీ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా గోదావరిఖని, సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో దసరా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంతోష్ నారాయణన్ స్వరకల్పన లో కాసర్ల శ్యామ్ రచన , రాహుల్ సిప్లిగంజ్ , గొట్టే కనకవ్వ గానం చేసిన దసరా మూవీ ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తాన్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది…

కాంతార పై తలైవా ప్రశంసలు
ప్రస్తుతం ఎక్కడ చూసినా కన్నడ సినిమా కాంతార సందడే కనిపిస్తుంది. కర్ణాటక, కేరళలో ఉన్న ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన గీతా ఆర్స్ట్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందిస్తుంది. హిందీలో కూడా ఈసినిమా అదే రేంజ్ లో దూసుకుపోతుంది.

500 కోట్ల క్లబ్ దిశగా పొన్నియిన్ సెల్వన్ 1
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష, జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సర్దార్ 2 అఫీషియల్ అనౌన్స్ మెంట్
తెలుగు ప్రేక్షకులకు తమిళ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యుగానికి ఒక్కడు సినిమాతోనే తనలో మంచి నటుడిని పరిచయం చేశాడు. ఇక ఆతరువాత ప్రతి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం అయితే వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న కార్తీకి రీసెంట్ గా సర్దార్ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. మొదటి భాగంలో సస్పెన్స్ అంశాలతో నీటి విలువని తెలియజేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లను రాబడుతోంది.

ఆర్ఆర్ఆర్ ఖాతాలో ఇంటర్నేషనల్ అవార్డ్
బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో తన సత్తాను మరోసారి ప్రపంచానికి తెలియచేశాడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా ఎంత సంచలన విజయం సాధించిందో చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కూడా ఈసినిమా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే ఉంది. రీసెంట్ గానే ఈసినిమా గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గా ప్రదర్శనకు గాను ఎంపికైంది.

అప్పుడు శివుడు.. ఇప్పుడు అయ్యప్ప
దర్శకత్వంలో రామ్ హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మాస్ యక్షన్ ఎంటర్ టైనర్ లు రామ్ కు కొత్తేమీ కాదు. తన కెరీర్ లో పక్కా మాస్ పాత్రలు ఎన్నో చేశారు. ఇక దానికి తోడు ఈసినిమాకు మాస్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

ది ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా( IFFI) లో ఆర్ ఆర్ ఆర్ , అఖండ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.

రవితేజ ధమాకా మూవీ రిలీజ్ డేట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా తెరకెక్కిన విషయం తెలిసిందే.భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , హీరో రవితేజ , శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన ఫస్ట్ సింగిల్ జింతాక్ , గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నా లైఫ్ అంతా ప్రభాస్ అభిమానినే
టాలీవుడ్ యంగ్ సంతోష్ శోభన్ బాలనటుడిగా పలు సినిమాల్లో చేసినా హీరోగా పరిచయమై పేపర్ బాయ్, మంచి రోజులు వచ్చాయి, ఏక్ మినీ కథ సినిమాలతో మంచి పేరును సొంతం చేసుకున్నాడు సంతోష్ శోభన్. ఇక జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయింది ఫరియ అబ్దుల్లా. మొదటి సినిమాలోనేతన న్యాచురల్ యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

మనసు చాటుకున్న మెగా ప్రిన్స్
టాలీవుడ్ హీరోలు కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలుగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కొంతమంది చేసే పనులు బయటకు రావచ్చు.. కొంతమంది చేసే పనులు బయటకి కనిపించకపోవచ్చు కానీ.. చాలామంది సెలబ్రిటీలు మాత్రం చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక ఈకార్యక్రమాల్లో మెగా ఫ్యామిలీ కూడా ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి తెలిసిందే కదా. అందులో మెగా దిగ్గజం చిరు చేసే సేవా కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాంతార మూవీ పై స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే స్పందన
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కాంతార మూవీ ఇతర భాషలన్నింటిలోనూ 60 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

వాల్తేరు వీరయ్య కు సూపర్ రెస్పాన్స్
మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన తరువాత సినిమాపై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు మెగా 154 టైటిల్ తో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటూ వచ్చింది.